Thursday, March 10, 2016

గలగల జలజలా





చిత్రం : పొట్టేలు పున్నమ్మ (1978)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్యా ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు
నిలకడ లేక... అలసట లేక
నీడ వెతుకుతున్నాను.. తోడు వెతుకుతున్నాను 



గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు


చరణం 1 :


వరద వచ్చి నువ్వు ఉరకలే వేసేవు
వయసు వచ్చి నేను కలలెన్నో కన్నాను


వరద వచ్చి నువ్వు ఉరకలే వేసేవు
వయసు వచ్చి నేను కలలెన్నో కన్నాను


నీ అలలకంతమెప్పుడో... ఆ కలలకర్ధమేమిటో
ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లనీ మనసు



గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు



చరణం 2 :


సాగరమున్నదని నువ్వు సాగి పోయేవు
ఏ గట్టు లేక నేను కట్టుబడి ఉన్నాను
సాగరమున్నదని నువ్వు సాగి పోయేవు
ఏ గట్టు లేక నేను కట్టుబడి ఉన్నాను



నీ సంబరమెపుడు తీరునో.. నా సంబరమెవరి తోడనో
ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లనీ మనసు



గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు



చరణం 3 :


కొండలైన కోనలైన నిన్ను ఆపలేవు... కోటి వరాలిచ్చినా నన్ను పొందలేరు
కొండలైన కోనలైన నిన్ను ఆపలేవు... కోటి వరాలిచ్చినా నన్ను పొందలేరు


నీవెక్కడింకి పోతావో... నేనెక్కడిమిడి పోతానో
ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లనీ మనసు



గలగల జలజలా జలజలా జలజలా గలగల
పారే చిట్టేరూ నేను నువ్వు ఒకటే తీరు




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5331

No comments:

Post a Comment