Thursday, March 10, 2016

కలిసిన హృదయాలలోన




చిత్రం : ప్రేమ-పగ (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం :  బాలు, వాణీజయరాం 



పల్లవి :

కలిసిన హృదయాలలోన...
కలిసిన హృదయాలలోన...  పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన...  పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన...



చరణం 1 :


మధుర మనోహర మోహన గీతం...  మదిలో మెదిలే మమతల సారం
మధుర మనోహర మోహన గీతం... మదిలో మెదిలే మమతల సారం


రమ్మని పిలిచే యమునా తీరం
రమ్మని పిలిచే యమునా తీరం
రాధా మాధవ రాగ తాళ భావ గీతిలో

కలిసిన హృదయాలలోన...  పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన...



చరణం 2 :


పమగరిగా..పమగరిగా
నిదపమపా..నిదపమపా
మమదదనినిరిరిగరిస... మమదదనినిరిరిగరిస
నిరినిదా... దనిదమా
మదమగ.. ఆ.. ఆ.. ఆ.. 



తేనెలు చిలికే సుందర కుసుమం...  ఝుమ్మని పలికే అల్లరి భ్రమరం
తేనెలు చిలికే సుందర కుసుమం... ఝుమ్మని పలికే అల్లరి భ్రమరం

కలిసిన నాడే కలుగును ప్రణయం
కలిసిన నాడే కలుగును ప్రణయం...
కవితా వనితా తోడు నీడ లేక నిలుచునా


కలిసిన హృదయాలలోన...  పలికెను అనురాగ వీణ
కలిసిన హృదయాలలోన...




1 comment: