Wednesday, March 30, 2016

పరుగులు తీసే వయసుంటే

చిత్రం : స్టేషన్ మాస్టర్ (1987)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి :

హె ఏ అహా లాలా
పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా
ల లల లలా లలా


చరణం 1 : 

ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం
చిరుచిరు నవ్వుల దీపం ఉంటె
చిక్కుల దిక్కులన్ని దాటుకు పోవాలి
చుక్కలున్న మజిలి చేరాలి
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలి లోనే నిలపాలి
కరక్ట్
సందేహించక ముందుకు పోతే... గెలుపు చిక్కడం ఖాయం
డెఫెనేట్లీ
దూసుకుపోయే ధైర్యం ఉంటే...  ఓడక తప్పదు కాలం
ల లల లలా లాల లా
దు దుదు తర తరా రా

పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే



కొండలు కోనలు అడ్డున్నాయని.... సాగక మానదు సెలయేరు
గల గల పాటల హుషారు ఉంటే అలసట కలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి... ఆనందపు లోతులు చూడాలి
కోరిన స్వర్గము చేరిన నాడే మనిషికి విలువని చాటాలి


ఆ.... ఆహా
ఆలోచించక అడుగులు వేస్తే... పడుతు తొక్కడం ఖాయం
నేలను విడిచిన సాములు చేస్తే...  తగలక తప్పదు గాయం
ల లల లలా లలా
ల లల లలా లలా


పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా
కు ఊ కు ఊ
చికుచికు చికుచికు చికుచికు
ల లల లలా లలా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11557

No comments:

Post a Comment