Monday, March 28, 2016

గోపీలోల... నీ పాల పడ్డామురాచిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, శైలజ 


పల్లవి :


గోపీలోల.. నీ పాల పడ్డామురా
లీలాలోల.. అల్లాడుతున్నామురా
చనీళ్లలో ఉన్నామురా... చిన్నరులం మన్నించరా 


భామా భామా... తీరాన్ని చేరాలమ్మా
పరువేకోరి... చెయ్యెత్తి మొక్కాలమ్మా
అందాక మీ అందాలకు.. ఆ దిక్కులే దిక్కమ్మలూ 


గోపీలోల... నీ పాల పడ్డామురా 
చరణం 1 :జాలిమాలిన ఈ గాలీ.. తేరిపార చూసే రేపే ఈల
మావిమాటున దాగుంటే.. గువ్వలు చూసి నవ్వే గోల 


తరుణి రో.....కరుణతో మోక్షం చూపే.. కిరణమై నిలిచానే
తనువుతో పుట్టే మాయను.. తెలుపగా పిలిచానే
మోక్షం కన్నా.. మానం మిన్న
నిన్ను నన్ను కన్నులు మూసేనా


గోపీలోల.. నీ పాల పడ్డామురా
భామా భామా.. తీరాన్ని చేరాలమ్మా
చనీళ్లలో ఉన్నామురా.. చిన్నరులం మన్నించరా ..
గోపీలోల.. నీ పాల పడ్డామురా చరణం 2 :


వాడిపొనీ సిరులెన్నో.. పూలు పూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ
నేను కోరే ఆ తారా..  ఏది మీలోన భామా భామా భామా


తగదు రా.....ఇది మరీ సోద్దెం కాదా.. సొగసరీ గోవిందా
అందరూ నీ వారేగా.. ఒకరితూ ముడి ఉందా..


చూసే కలలూ.. ఎన్నో ఉన్నా.. చూపే హృదయం ఒకటే ఉందమ్మ


గోపీలోల.. నీ పాల పడ్డామురా
లీలాలోల... అల్లాడుతున్నామురా
చనీళ్లలో ఉన్నామురా... చిన్నరులం మన్నించరా ..
అందాక మీ అందాలకు... ఆ దిక్కులే దిక్కమ్మలూ 


భామా భామా... తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి... చెయ్యెత్తి మొక్కాలమ్మా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11506

No comments:

Post a Comment