Monday, March 7, 2016

తోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు




చిత్రం : రాజు వెడలె (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, బాలు  





పల్లవి :



ఉమ్మ్...ఉమ్మ్..ఉమ్మ్.. లా.. లలలా..

ఏయ్..ఏయ్..ఏయ్..ఏయ్..
హా.. హా.. హా.. హా..
అబ్బా.. చంపేస్తున్నావు.. నేనా? బాగుంది... నేనేం చేశాను



తోడేస్తున్నావు...  ప్రాణం తోడేస్తున్నావు
సొగసులతో...  ఆ సొగసుల నిగనిగతో
పరువంతో...  ఆ పరువం మిసమిసతో
తోడేస్తున్నావు...  అబ్బా...  ప్రాణం తోడేస్తున్నావు


దొలిచేస్తున్నావు..  గుండెను దొలిచేస్తున్నావు
చూపులతో... ఆ చూపుల బాకులతో
నవ్వులతో...  ఆ నవ్వుల రవ్వలతో
దొలిచేస్తున్నావు...  గుండెను దొలిచేస్తున్నావు 



చరణం 1 :



మల్లెపువ్వులు అగరువత్తులు... అబ్బ మతిపోగొట్టినవి
కమ్మని తావి... చల్లని గాలి... కలవరపెట్టినవి


నీలి నింగిలో నిండు జాబిలి నిప్పులు చెరిగింది
చల్లచల్లని వెన్నెల సూదుల జల్లే కురిసింది
నీలి నింగిలో నిండు జాబిలి నిప్పులు చెరిగింది
చల్లచల్లని వెన్నెల సూదుల జల్లే కురిసింది


అబ్బబ్బబ్బ... తోడేస్తున్నావు...  ప్రాణం తోడేస్తున్నావు
దొలిచేస్తున్నావు...   గుండెను దొలిచేస్తున్నావు 



చరణం 2 :



వయసు పొంకము.. వగల బింకము.. వదలొద్దని పిలిచింది
గుండె విరిచి.. నిండు మగసిరి.. ఉండలేనని ఉరికింది 

పెదవీ పెదవీ తనువూ తనువూ ఒకటైపోవాలి
ఉదయం నుంచీ ఉదయం వరకూ క్షణమే అనిపించాలి
పెదవీ పెదవీ తనువూ తనువూ ఒకటైపోవాలి
ఉదయం నుంచీ ఉదయం వరకూ క్షణమే అనిపించాలి  


అమ్మమ్మమ్మ...  దొలిచేస్తున్నావు...   గుండెను దొలిచేస్తున్నావు
తోడేస్తున్నావు...  ప్రాణం తోడేస్తున్నావు
చూపులతో...  ఆ చూపుల బాకులతో
సొగసులతో...  ఆ సొగసుల నిగనిగతో
దొలిచేస్తున్నావు...   గుండెను దొలిచేస్తున్నావు...   అబ్బ
దొలిచేస్తున్నావు...  ప్రాణం తోడేస్తున్నావు




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2439

No comments:

Post a Comment