Tuesday, March 8, 2016

నయనాలు మాటాడెనా

చిత్రం : మా వూళ్ళో మహాశివుడు (1979)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : సుశీల, బాలు  పల్లవి :నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...
నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...
నీ ప్రియ భావనలు తెలుప పెదవులు తడబడగ


నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...
నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...
నీ ప్రియభావనలు తెలుప పెదవులు తడబడగ


నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...చరణం 1 :కోవెలలో దేవత తానే ఈవనిలో సాగెనా... ఆ..
పున్నమిలాంటి వెన్నెల తానే కన్నెపడుచుగా మారెనా... ఆ..
చిత్రములోని చెలువము తానే ...
చిత్రములోని చెలువము తానే...  కమలవదనయై కదలాడెనా?నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...
నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...
నీ ప్రియభావనలు తెలుప పెదవులు తడబడగ
నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...చరణం 2 :దేవుడు ఎదురై నిలిచిన వేళ... మనసు మాలికగా మారునులే
మోహన మురళి పిలిచిన వేళ... యమున రమణియై పొంగునులే
రవికిరణాలే సోకిన వేళ...
రవికిరణాలే సోకిన వేళ...
కమలహృదయమే విరుయునులే...


నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...
నయనాలు మాటాడెనా... ఆ.. ఆ...
నా ప్రియభావనలు తెలుప పెదవులు తడబడగ
నయనాలు మాటాడెనా

No comments:

Post a Comment