Thursday, March 31, 2016

రాదే చెలి నమ్మరాదే చెలి
చిత్రం : మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : చిత్ర 


పల్లవి :


రాదే చెలి నమ్మరాదే చెలి... మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి...  మగనారీ మనసమ్మరాదే చెలిచరణం 1 :


నాడు పట్టుచీర కట్టవద్దు బరువన్నాడే
నేడు నూలు చీరకి డబ్బులు కరువన్నాడే
నెల తప్పిన నెలత తనకి పరువన్నాడే
నేడు నెల బాలుని చేతికిస్తే బరువన్నడే
ముంగురులను చూసి తాను మురిసిపోయాడే
ఆ కురులకు విరులివ్వడమే మరచిపోయాడే
ప్రేమించు సీజన్లో   పెద్ద మాటలు
పెళ్ళయ్యాక ప్లేట్లు ఫిరాయింపులు

మొదటి వలపు.. మధుర కథలు.. మరిచెను ఘనుడు


మగవారినిలా నమ్మరాదే చెలి... రాదే చెలి నమ్మరాదే చెలి
మగవారినిలా నమ్మరాదే చెలి
చరణం 2 :


మాటల్తో కోట కట్టాడే.. అమ్మో
నా మహరాణి నీవన్నాడే
కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే
గాలి తాకితే వాగుల కాలువిరుగునన్నాడే
కవ్వించుకున్నాడే కౌగిలి కోసం
ఆ కాస్త తీరాక మొదటికి మోసం
మనవి వినడు.. మనసు కనడు.. మాయల మొగుడు


మగవారినిలా నమ్మరాదే చెలి... రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగనారీ మనసమ్మరాదే చెలి..చరణం 3 :

తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టే
సతి మదిలో నన్నెలగిడు పురుషుడు కలుగుట
తొలి జన్మము నోమభయము తోయజనేత్రా
తనుగా వలచిన వరుడేనా...  ఈ పురుషోత్తముడు
వ్రతములు సలిపిన సతులకు గతి కలదా... ఇలలో ... కలదో...  లేదో No comments:

Post a Comment