Thursday, April 14, 2016

మన్నించుమా... కడలేని ఈ దాహం

చిత్రం : కల్యాణ చక్రవర్తి (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   సుశీల, బాలు




పల్లవి :


మన్నించుమా... కడలేని ఈ దాహం...  విడలేని మా స్నేహం
నాలోకం.. నా స్వర్గము.. మధుకలశమేలే..ఏ..ఏ


మన్నించుమా... కడలేని నీ దాహం...  విడనాడు వ్యామోహం
నీలోకము... నీ స్వర్గము... విషకలశమేలే.. ఏ.. ఏ..


మన్నించుమా... ఆ.. ఆ.. 




చరణం 1 :




ఈ చేదు చినుకులలో... కునుకేసుకుంటున్నా
ఆ తీపి మైకంలో.. తలదాచుకుంటున్నా
మనసులో చస్తున్నా... మనిషిగా బ్రతికున్నా
మనసులో చస్తున్నా... మనిషిగా బ్రతికున్నా
ఇది నేరమా.. ఇది పాపమా




ఇది ఎండమావులలో... తుదిలేని ఎదురీతా
ఇది నిండు బ్రతుకులలో.. చెలరేగు చితిమంటా
ఇది నేరమో.. ఇది పాపమో.. తెలుసుకో ఇకనైనా.. ఆ.. ఆ




మన్నించుమా... కడలేని ఈ దాహం... విడలేని మా స్నేహం
నీలోకము... నీ స్వర్గము... విషకలశమేలే.. ఏ.. ఏ..


మన్నించుమా... 





చరణం 2 :



మనసైన తోడుంటే... మధువెందుకంటున్నా
వలపించే ఈడుంటే... వగపెందుకంటున్నా
మేలుకోమంటున్నా... మారిపో నేడైనా...
మేలుకోమంటున్నా... మారిపో నేడైనా...
ఇది నేరమా.. ఇది పాపమా



ఇది మండు వేసవిలో... మరుమల్లె తొలిపూతా
నా గుండె లోతులలో... నూరేళ్ళ పులకింతా...
ఇది నేరమూ.. ఇది పాపము.. తెలుపుమా నీవైనా.. ఆ.. ఆ



మన్నించుమా... కడలేని నీ దాహం.. విడనాడు వ్యామోహం
నీలోకము... నీ స్వర్గము... మన కోసమేలే... 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4155

No comments:

Post a Comment