Wednesday, April 13, 2016

పలుకు చూస్తే... సరిగమపదనిస

చిత్రం : కల్యాణ చక్రవర్తి (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :   సుశీల, బాలు




పల్లవి :


పలుకు చూస్తే... సరిగమపదనిస సా
నడక చూస్తే...  తకధిమి తకఝణు తకధిమి తకఝణు తకధిమి తకఝణు తా... 


నువ్వే నా రాగం...
నువ్వే నా తానం...
నువ్వే నా పల్లవి...
నువ్వే నా రాగం తానం పల్లవి... నే రమ్మని పిలిచే పిల్లవి
నా బుల్లివి.. జాబిల్లివి.. మరుమల్లివి... హా



పలుకు చూస్తే... సరిగమపదనిస సా .. సా.. సా... సా..
నడక చూస్తే...  తకధిమి తకఝణు తకధిమి తకఝణు తకధిమి తకఝణు తా... 





చరణం 1 :




నీ...  జిలుగు నడకలో ఉన్నది... హంస అడుగుల అఠాణ
ఆ... చిలుపి నవ్వులో ఉన్నది... వలపుమువ్వల థిల్లాన 


నీ పైట రెపరెపలాడినా...  నా గుండె గుబగుబలాడినా
పైలాపచ్చీసు పై తాళంలో పార్దియాల ఘరాణ
పైలాపచ్చీసు పై తాళంలో పార్దియాల ఘరాణ


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ...



సరసకొస్తే.... సరిగమపదనిస.. నస... నస
వరస చూస్తే... తకధిమి తకఝణు తకధిమి తకఝణు తకధిమి తకఝణు తా... 


నువ్వే నా రాగం... ఆ... ఆ..
నువ్వే నా తానం... అయ్యో
నువ్వే నా పల్లవి... ఓ యమ్మో
నువ్వే నా రాగం తానం పల్లవి... నే రమ్మని పిలిచే పిల్లగాడివి
పిచ్చివాడివి... బిచ్చగాడివి... నచ్చినోడివి


సరసకొస్తే.... సరిగమపదనిస.. నస... నస
వరస చూస్తే... తకధిమి తకఝణు తకధిమి తకఝణు తకధిమి తకఝణు తా... 





చరణం 2 :



ఆ.. పదను చూపులో ఉన్నవి... పడుచు గానాబజానా
నీ... హద్దు దాటితే ఉన్నవి... మెత్తగా తందానతానా


నీ ఊపు ఉరకలు వేసినా .. పరువాలు పరగలు వేసినా
ఆరునొక రాగంలో....  ఆనందభైరవి పాడిస్తా
ఆరునొక రాగంలో....  ఆనందభైరవి పాడిస్తా


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ..


పలుకు చూస్తే... సరిగమపదనిస సా .. సా.. సా... సా..
వరస చూస్తే... తకధిమి తకఝణు తకధిమి తకఝణు తకధిమి తకఝణు.... తా... 






No comments:

Post a Comment