Monday, April 18, 2016

స్నేహాని కన్న మిన్న



చిత్రం :  ప్రాణ స్నేహితులు (1988)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు





పల్లవి :


స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా


స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
కడదాక నీడలాగ నిను వీడిపోదురా


నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగ నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా 


స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా  




చరణం 1 :



తులతూగే సంపదలున్నా.. స్నేహానికి సరిరావన్న
పలుకాడే బంధువులున్నా..  నేస్తానికి సరికారన్న
మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా
ఆ స్నేహమే నీ ఆస్తిరా..  నీ గౌరవం నిలిపేనురా
సందేహమే లేదురా



స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
కడదాక నీడలాగ నిను వీడిపోదురా




చరణం 2 :



త్యాగానికి అర్ధం స్నేహం.. లోభానికి లొంగదు నేస్తం
ప్రాణానికి ప్రాణం స్నేహం..  రక్తానికి రక్తం నేస్తం 


నీది నాదను భేదం లేనిది..  నిర్మలమైనిది స్నేహమురా
ధ్రువతారలా స్థిరమైనది..  ఈ జగతిలో విలువైనది
ఈ స్నేహమొకటేనురా




స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
కడదాక నీడలాగ నిను వీడిపోదురా


నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగ నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4195

3 comments:

  1. గీతరచన భువనచంద్ర గారు అనుకుంటానండీ.

    ReplyDelete
  2. ఈ నా వ్యాఖ్యల వల్ల మీకు అసౌకర్యం కలిగిస్తున్నానేమో. మీరు సరిచేసిన పిదప, నా వ్యాఖ్యలను తొలగించి వేయండి.

    ReplyDelete
    Replies
    1. పర్వాలేదండి... నేను రాసేటప్పుడు నా తప్పులు నాకు తెలియవు, మీరు ఇంత సున్నితంగా పరిశీలిస్తునందుకు ధన్యవాదాలండి. __/\__

      Delete