Monday, April 11, 2016

పాడుతూ ఉంటాను

చిత్రం : శిక్ష (1985)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :
నేపధ్య గానం  :   సుశీల



పల్లవి  :


పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ
ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ
నే పాడుతూ ఉంటానూ.... 



పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ
ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ
నే పాడుతూ ఉంటానూ.... 



చరణం 1 :


నా పాటలో పలుకు ప్రతిమాటలో తొణుకు
అనురాగమే నీకు నా అర్చనై
నీ కనులలో కులుకు చిరునవ్వులో చిలుకు
అభిమానమే నాకు నీ అభయమై


నా పాటలో పలుకు ప్రతిమాటలో తొణుకు
అనురాగమే నీకు నా అర్చనై
నీ కనులలో కులుకు చిరునవ్వులో చిలుకు
అభిమానమే నాకు నీ అభయమై



నేను నీ సేవనై...  నీవు నా స్వామివై
ఈ ఇల్లు శివపార్వతుల వాసమై... కైలాసమై విలసిల్లగా...


నే పాడుతూ ఉంటానూ.... 




చరణం 2 :



వెన్నెల్లు వచ్చినా చీకట్లు ముసిరినా
ఒక రీతినే మురియు ఆకాశమై
ఒక బాటనైనా ఎడబాటునైనా
ఒక ప్రీతినే చూపు అనుబంధమై


వెన్నెల్లు వచ్చినా చీకట్లు ముసిరినా
ఒక రీతినే మురియు ఆకాశమై
ఒక బాటనైనా ఎడబాటునైనా
ఒక ప్రీతినే చూపు అనుబంధమై



నేను నీ ఆత్మనై ... నీవు పరమాత్మవై
నేను నీ ఆత్మనై ... నీవు పరమాత్మవై
మన జంట సుఖదుఃఖ్ఖముల యోగమై.. ఒక యాగమై తరియించగా....


నే పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ

ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంత వరకూ

నే పాడుతూ ఉంటానూ.... 






No comments:

Post a Comment