Monday, April 11, 2016

గోరంత సూరీడు

చిత్రం : పెళ్ళి చేసి చూపిస్తాం (1983)
సంగీతం  :  రామకృష్ణం రాజు
గీతరచయిత  :  రాజశ్రీ
నేపధ్య గానం  :  బాలు, సుశీల




పల్లవి  :


గోరంత సూరీడు... ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపలా... నా గుండెలో పాటగా


గోరంత సూరీడు... ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపలా... నా గుండెలో పాటగా

కొనచూపే రాగాలుగా.. చురునవ్వే తాళాలుగా
కొనచూపే రాగాలుగా.. చురునవ్వే తాళాలుగా
చురునవ్వే తాళాలుగా...


గోరంత సూరీడు... ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపలా... నా గుండెలో పాటగా



చరణం 1 :



సొగసే తూరుపు సింధూరం... మనసే వాడని మందారం
నిలువెల్ల హరివిల్లై నిలిచే ఆమని నీ రూపం



తొణికే వేకువ నీ పిలుపు... ఉరికే వెల్లువ నా తలపు
తొలిసంధ్య తొలిసారి పలికే పల్లవి నీ చూపు



నీ దోర అందాల పందిళ్ళలోనా.. తేనెల్ల వానల్లు చిందుంచుకోనా
నీ కళ్ళ వాకిళ్ళ నీరెండలోనా... అచ్చట్లు ముచ్చట్లు ఆరేసుకోనా



ఈవేళా... ఏవేళా... సాగేను నీ తోడుగా



గోరంత సూరీడు... ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపలా... నా గుండెలో పాటగా



చరణం 2 :



విరిసే పువ్వులు నీ కోసం... వీచే గాలులు నా కోసం
మలిసంధ్య మనకోసం పలికే మంగళ సంగీతం



పడమట ఎర్రని ఆకాశం... పరచెను కుంకుమ నీ కోసం
పడిలేచే ప్రతి కెరటం కసిగా పొంగెను నా కోసం



నీ నవ్వు లోగిళ్ళ నీడల్లలోనా.. బంగారు కలలన్నీ పండించుకోనా
నీ లేత చెక్కిళ్ళ అద్దాలలోనా... నా ముద్దు మురిపాలు నే చూసుకోనా


ఈవేళా... ఏవేళా... సాగేను నీ నీడగా


గోరంత సూరీడు... ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపలా... నా గుండెలో పాటగా



కొనచూపే రాగాలుగా.. చురునవ్వే తాళాలుగా
కొనచూపే రాగాలుగా.. చురునవ్వే తాళాలుగా
చురునవ్వే తాళాలుగా...


గోరంత సూరీడు... ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపలా... నా గుండెలో పాటగా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5109

No comments:

Post a Comment