Wednesday, June 1, 2016

మంచమేసి దుప్పటేసి





చిత్రం : కొండవీటి రాజా (1986)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి 




పల్లవి :



తననం తననం తననం తననం... తననం తననం తా
తననం తననం తననం తననం... తననం తననం తా

మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా.. తనన తననం
చిన్నచీర కట్టాను సన్నజాజు లెట్టాను రారా రారా.. తనన తననం

దిండు ఎంత మెత్తనో మంచ మెంత గట్టిదో
చుక్కలోంక చూసుకుంటూ లెక్కబెట్టుకుందాము రారా


ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే... తనన తననం... 

ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను రావే రావే... తనన తననం


పండు ఎంత తీయనో పాలు ఎంత చిక్కనో

సోకులోంక చూసుకుంటూ సొమ్మసిల్లిపోదాము రావే




చరణం 1 :



నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది...తనన తననం..
నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది ...తనన తననం...


కౌగిలింత కోరలేక అలిసిపోతిని
రాతిరంత కునుకులేక రగిలిపోతిని

కసి కసి ఈడు కమ్ముకొస్తే ... కంటిని రెప్పే కాటు వేస్తే
ఎట్టా ఆగను చలిలో విరులు ... ఎట్టా అడగను అసలు కొసరు
సాగాలి ... నీ జోరు


ఆకలేసి దప్పికేసి అన్నమంటూ వచ్చాను రావే రావే

మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా.. రారా




చరణం 2 :



పెరుగుతున్న సోకుమీద మీగడున్నది... తనన తననం...
పెదవి తాకి ముద్దులాగ మారుతున్నది... తనన తననం..


చీకటింట చిట్టిగుండె కొట్టుకున్నది
వాలుకంట వలపుమంట అంటుకున్నది


జళ్ళో పువ్వు జావళి పాడే ....ఒళ్ళో ఒళ్ళో ఒత్తిడి సాగే
ఎంత తీరినా ఎదలో సొదలే ...వింతవింతగా జరిగే కతలే
మోగాలి....  తొలితాళం 




మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా.. తనన తననం..
ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను రావే రావే.. తనన తననం..


దిండు ఎంత మెత్తనో మంచమెంత గట్టిదో
సోకులోంక చూసుకుంటూ సొమ్మసిల్లిపోదాము రావే




తననం తననం తననం తననం... తననం తననం తా
తననం తననం తననం తననం... తననం తననం తా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9375

No comments:

Post a Comment