Wednesday, July 13, 2016

చుక్కల పల్లకిలో

 

 

 

చిత్రం :  స్టేట్ రౌడీ (1989)

సంగీతం :  బప్పిలహరి

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో

పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో


అనురాగాలే...ఆలపించనా...
ఆకాశమే...మౌన వీణగా...ఆ.. ఆ... ఆ.. ఆ

చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో

పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో



చరణం 1 :


నీ చిరునడమున వేచిన సిగ్గులు దోసిట దోచాలనీ

ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలనీ

హే.. పడుచుదనం చెప్పిందిలే..  పానుపు మెచ్చిందిలే...హో

 

 

చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో

పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో





చరణం 2 :


తలపులు ముదిగిన తొలకరి వయసుకు తొలి ముడి విప్పాలనీ

పెరిగే దాహం జరిపే తపనం పెదవికి చెప్పలనీ

హే తనువెల్లా కోరిందిలే...  తరుణం కుదిరిందిలే...హో




చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో

పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో

అనురాగాలే...ఆలపించనా...

ఆకాశమే...మౌన వీణగా...ఆ...ఆ...ఆ...ఆ

 

 

చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో

పలికెను కల్యాణ గీతం మలయసమీరంలో




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=9433

No comments:

Post a Comment