చిత్రం : కూతురు కోడలు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు, వసంత
పల్లవి :
గాజులు ఘల్లనగానే జాజులు ఘుమ్ ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే
తుమ్మెద ఝుమ్ ఝుమ్మనగానే తెమ్మెర రా రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే
చరణం 1 :
నీ కాటుక కన్నుల సొగసు... నీ చెంగున దూకే వయసు
నన్నెంతో తొందరచేసే... నీ కౌగిట బందీ చేసే
వెచ్చని వెన్నెలలోన... విచ్చిన కలువను చూసీ
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే
చరణం 2 :
నీ కదిలే పెదవులు చూసి... నా మెరిసే చెక్కిలి మురిసి
నీ వెచ్చని ఒడిలో చేరి... నా వయసే పొంగెను నేడే
కోయిల కోయనగానే కొమ్మలు ఓయనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే
చరణం 3 :
నలనల్లని ఆకాశంలో... తెలతెల్లని మేఘంలాగా
నల్లని ఆకాశంలో తెలతెల్లని మేఘంలాగా
నీ నీలికురులలో విరిసే మరుమల్లెలు నావే నావే
నీ హృదయపు పందిరిమీద పెనవేసిన మమతల తీగ
హృదయపు పందిరిమీద... పెనవేసిన మమతల తీగ
విరబూసిన వలపుల పూలే ఏ నాటికి నావే నావే
గాజులు ఘల్లనగానే... జాజులు ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే
తుమ్మెద ఝుమ్మనగానే... తెమ్మెర రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే
లలలాలాలాలాలల.... లలలాలాలాలాలలలలా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2441
Very nice song. I don't know why it is not very popular..
ReplyDelete