Sunday, August 28, 2016

నీతోనే ఠంకాపలాసు

చిత్రం : స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :

నీతోనే ఠంకాపలాసు...
ఇది ప్రేమాటైనా పేకాటైనా.. నువ్వే నా కళావరాసు
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా.. నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు..  అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు...  అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు

నీతోనే ఠంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా.. నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా.. నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు..హా 

చరణం 1 :

నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో...
నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో...

క్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా... చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా..ఆ..ఆ...ఆ
క్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా... చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా

నీతోనే ఠంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా.. నువ్వే నా కళావరాసు
హోయ్.. నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా.. నీతోనే చేస్తా రొమాన్సు

చరణం 2 :

పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి
పరువములే పరిచయమౌ ప్రియలయలో
పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి
పరువములే పరిచయమౌ ప్రియలయలో...

హే... శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా..
యావత్తు నీకే అందిస్తా
శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా

హా.. నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా.. నీతోనే చేస్తా రొమాన్సు
నీతోనే ఠంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా.. నువ్వే నా కళావరాసు

యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా.. నీతోనే చేస్తా రొమాన్సు
నీతోనే ఠంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9456

No comments:

Post a Comment