Monday, October 24, 2016

ఇటిక మీద ఇటికేస్తే

చిత్రం :  భలే కృష్ణుడు (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా

ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... నా చిటికనేలు పట్టుకుంటే పెళ్ళౌతాది
ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... నా చిటికనేలు పట్టుకుంటే పెళ్ళౌతాది

అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా

ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... ఈ కిటుకు తెలుసుకుంటే మన పెళ్ళౌతాది
ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... ఈ కిటుకు తెలుసుకుంటే మన పెళ్ళౌతాది

చరణం 1 :

నిన్ను చూస్తే కన్నుకేమో నిదుర పట్టదు..
నీకు ముద్దులిస్తే పాడు మూతి ముద్ద ముట్టదు...
నువ్వు చూస్తే పూట పూటా పులకరిస్తది..
నువ్వు నవ్వగానే తోటకొక్క పువ్వు  పూస్తది

రావిపండు కొండ మీద రామచిలుక నేనంట
బావి గట్టు గిలక మీద తోటుంది రమ్మంటా

గిలకేమో తిరగాలా... చిలకేమో ఎగరాలా
గిలకేమో తిరగాలా... చిలకేమో ఎగరాలా
నువ్వెంట తగలాలా... పదిమందీ చూడాలా 

అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అబ్బబ్బ.. అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అ... అ... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా

ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... ఈ కిటుకు తెలుసుకుంటే మన పెళ్ళౌతాది
ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... నా చిటికనేలు పట్టుకుంటే పెళ్ళౌతాది

చరణం 2 :

పట్టపగలు పిట్ట గుబులు పుట్టుకొస్తది
అర్ధరాత్రి పైర గాలి ప్రాణమౌతది
నువ్వు రాకా పొద్దు పోక ఏడిపిస్తది
నువ్వు తాక గానే సోకు నాకు ఎక్కువౌతది

తాటి రేవు కుర్రదాన ఆకు చిలకలిమ్మంటా
సందె కాడ నీడలోన చాటుంది రమ్మంటా

చెయ్యి బుగ్గ వెయ్యాలా... చెట్టు మొగ్గలెయ్యాల
చెయ్యి బుగ్గ వెయ్యాలా... చెట్టు మొగ్గలెయ్యాల
అవి పూలు పుయ్యాలా... నువ్వు కోసిపెట్టాలా

అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా

ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... నా చిటికనేలు పట్టుకుంటే పెళ్ళౌతాది
ఇటిక మీద ఇటికేస్తే ఇల్లౌతాది... ఈ కిటుకు తెలుసుకుంటే మన పెళ్ళౌతాది

అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అబ్బబ్బా... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అమ్మమ్మ... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా
అబ్బబ్బా... అమ్మాడి అమ్మా... అబ్బాడి అబ్బా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3969

No comments:

Post a Comment