చిత్రం : భలే కృష్ణుడు (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
స్వస్తీశ్రీ చాంద్రమాన మన్మధ సంవత్సరాన...
మాఘశుద్ధ పంచమి ఆదివారం ఉదయం...
భరణి నక్షత్రయుక్త మిథున లగ్నంలో...
మోగాలి మోతగా డోలు సన్నాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి...
ఆ మోత కన్నా మోతగా మన జోడూ సన్నాయి
హేయ్... మోగాలి మోతగా డోలు సన్నాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి...
మన ముద్దులే మద్దెళ్లుగా ఈ జోడూ సన్నాయి
ఎప్పుడబ్బాయి.. పెళ్ళెప్పుడబ్బాయి
హేయ్.. అప్పుడమ్మాయి... అయినప్పుడమ్మాయి
చరణం 1 :
చూపుల్లో చదివాను శుభలేఖలూ... చుక్కల్లో గడిపాను శివరాత్రులు
మాటల్లో విన్నాను నీ మనసులు... మనసుల్లో గడిపాను తొలిరాత్రులు
అందమంతా పొందు లేక అలసిసొలసి పోతుంటే
అందినంత పొందలేక ఎదలో రొదలే పుడుతుంటే
ఎప్పుడబ్బాయి.. పెళ్ళెప్పుడబ్బాయి
హహ.. అప్పుడమ్మాయి... అయినప్పుడమ్మాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి...
మన ముద్దులే మద్దెళ్లుగా ఈ జోడూ సన్నాయి
ఎప్పుడబ్బాయి.. పెళ్ళెప్పుడబ్బాయి
హేయ్.. అప్పుడమ్మాయి... అయినప్పుడమ్మాయి
చరణం 2 :
మొదలెన్నో చూడాలా పొద చాటునా.. పొగరాని సెగలున్న అగచాటునా
దొరగార్ని చూడాలా తెర చాటునా.. తెర బాకు చొరవున్న మొలవాటునా
తలలు వంచి గిలిమి పెంచే... కలికి సొగసే చూడాలా
కదమనంటే గొడవ పెంచే చేతి ఉడుకే చూడాలా
ఎప్పుడమ్మాయి.. పెళ్ళెప్పుడమ్మాయి.. హా
అప్పుడబ్బాయి.. అయినప్పుడబ్బాయి
అరెరే... మోగాలి మోతగా డోలు సన్నాయి
మోగాలి మోతగా డోలు సన్నాయి...
ఆ మోత కన్నా మోతగా మన జోడూ సన్నాయి
ఎప్పుడమ్మాయి.. పెళ్ళెప్పుడమ్మాయి..
హా.. అప్పుడబ్బాయి.. అయినప్పుడబ్బాయి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3754
No comments:
Post a Comment