Wednesday, October 26, 2016

వాన వెలిసిన వేళ





చిత్రం : ఘరానా దొంగ (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :



వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా... నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 




వాన వెలిసిన వేళ...  మనసు కలిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా... నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 



చరణం 1 :


చిలిపి చినుకుల చిత్తడిలో... వలపు మెరుపుల సందడిలో

చిలిపి చినుకుల చిత్తడిలో... వలపు మెరుపుల సందడిలో

ఉరిమి పిలిచే నీ ఒడి కోసం... ఉలికిపడి నే చూస్తుంటే



కురిసి వెలిసిన వానలలో... కలిసి బిగిసిన కౌగిలిలో
ఓ..కురిసి వెలిసిన వానలలో... కలిసి బిగిసిన కౌగిలిలో
నలిగిపోయిన ఆకాశం... పగలు వెన్నెల కాస్తుంటే



చూపూ చూపూ మాటాడాలా... మాటామాటా మానెయ్యాలా
వలపు వలపు వాటెయ్యాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 



వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా... నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..  



చరణం 2 :



చలికి సణిగిన పల్లవితో... ఉలికి పలికిన పెదవులలో

చలికి సణిగిన పల్లవితో... ఉలికి పలికిన పెదవులలో

ముద్దులడిగే ముచ్చట కోసం... పొద్దు గడవక చస్తుంటే


చీర తడిసిన ఆవిరిలో... ఆరిఆరని అల్లరిలో
ఓ..ఓ.. చీర తడిసిన ఆవిరిలో... ఆరిఆరని అల్లరిలో
హద్దు చెరిపే ఇద్దరి కోసం... మబ్బులెండను మూస్తుంటే



సిగ్గుల మొగ్గ తుంచెయ్యాలా... వెన్నెల పక్క పరిచెయ్యాలా
వేగుల చుక్క దాచెయ్యాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 


వాన వెలిసిన వేళ...  మనసు కలిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా... నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3756

No comments:

Post a Comment