చిత్రం : అత్తలు-కోడళ్లు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
చరణం 1 :
మనసులో రాగాలు స్వరములై పలికాయి
కన్నులలో రాగాలు కళలుగా వెలిశాయి
మనసులో రాగాలు స్వరములై పలికాయి
కన్నులలో రాగాలు కళలుగా వెలిశాయి
కన్నెగుండియలోన గమకాలు తెలిశాయి
ఆ….. ఆ….. ఆ….. ఆ….. ఆ…..
కన్నెగుండియలోన గమకాలు తెలిశాయి
సన్న సన్నగ వలపు సంగతులు వేశాయి
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
చరణం 2 :
మోహనాలాపించ మోహమే ఆపినది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
మోహనాలాపించ మోహమే ఆపినది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
శృతి కలిపి జత కలిసి...
సొక్కులెరిగిన వాడు తోడైన నాడే... నే తోడు పాడేది
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
చరణం 3 :
ఇన్ని రాగాలు ఈ ఎదలోన దాచినది ఏ మధురమూర్తికో ఏ మమత పంటకో
ఇన్ని రాగాలు ఈ ఎదలోన దాచినది ఏ మధురమూర్తికో ఏ మమత పంటకో
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై ...
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై వేచి ఉన్నది వీణ కాచుకున్నది కాన
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3061
No comments:
Post a Comment