Saturday, October 1, 2016

చలికొండలో.. చెలి గుండెలో






చిత్రం : లంకెబిందెలు (1983)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి : 


చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో...
ఆ సూర్యకిరణాల తడి ఆరని  ఉదయరాగాలలో


చలికొండలో.. ఓ.. ఓ.. నీ గుండెలో...
నా అందచందాల చలి తీరనీ ప్రణయ గీతాలలో  


చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో... 




చరణం 1 :



తొలిసారిగా తెలిసిందిలే వయసు వయ్యారమే
వేడిపుట్టిందో.. నీ నాడి ఏమందో..
పూతే మునిమాపై   చలి సరిగమ పలికిందో



తొలిరేయిలో తెలిసిందిలే మనువులో అందమే
ఈడు వచ్చింది... నీ తోడు నచ్చింది
పూలే విరబోసే తొలి ఘుమఘుమ తగిలింది
పగలు చల్లారిపోవాలని...


చలికొండలో.. ఓ.. ఓ.. నీ గుండెలో...




చరణం 2 :



పొగమంచులా చెలి చీరలో... సొగసు వణికిందిలే
పొద్దు వాలింది.. నీ పొందు కోరింది..
రేయే ఒక హాయై నీ బిగువులు అడిగింది



పెదవంచులా చిరుముద్దులో వలపు చిలికిందిలే
కొత్తపొంగుళ్లో నీ కొంగు జారింది
రేయే ఒడిలోనే నీ అలకలు తెలిసింది
రోజులే రాత్రులవ్వాయని...



హోయ్... చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో...
ఆ సూర్యకిరణాల తడి ఆరని  ఉదయరాగాలలో


లలలా... లలలా... లలలా... లలలా...
లలలాలలలా... లలలాలలలా...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3781



No comments:

Post a Comment