Wednesday, November 2, 2016

కనులు కనులు కలుసుకుంటే

చిత్రం : ఆడవాళ్ళు అపనిందలు (1976)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, జానకి  




పల్లవి :



కనులు.. కనులు.. కలుసుకుంటే మౌనం
మనసు.. మనసు.. తెలుసుకుంటే గానం


ఆ మౌనానికి మరో పేరే అనుబంధం
ఆ గానానికి మరో రూపమే అనురాగం


కనులు.. ఆ.. కనులు.. ఆ..  కలుసుకుంటే మౌనం
మనసు.. మనసు.. తెలుసుకుంటే గానం 



చరణం 1 :




నేలలా నీవు చేసాచితే... నింగిలాగా నే వాలితే
నేలలా నీవు చేసాచితే... నింగిలాగా నే వాలితే
ఆ కలయిక పేరే కౌగిలి... అది కలలు పండే లోగిలి


కనులు.. ఆ.. కనులు.. ఆ..  కలుసుకుంటే మౌనం
మనసు.. మనసు.. తెలుసుకుంటే గానం 




చరణం 2 :



చిరుగాలిలా నువ్వూగితే... పరిమళంలా నే సాగితే
చిరుగాలిలా నువ్వూగితే... పరిమళంలా నే సాగితే
మనము వేసే ప్రతి అడుగు... ఆనందాలకి వెన్నెల గొడుగు



కనులు.. ఆ.. కనులు.. ఆ..  కలుసుకుంటే మౌనం
మనసు.. మనసు.. తెలుసుకుంటే గానం 



చరణం 3 :



తలపులు విరబూసే... తొలిరాతిరిలోనా
తలపులు విరబూసే... తొలిరాతిరిలోనా
మన తనువులు ముడి వేసే... పెను తొందరలోనా


పరవశించే ప్రతి నిమిషం..
పరవశించే ప్రతి నిమిషం...  మరువరానీ మధురానుభవం



కనులు.. ఆ.. కనులు.. ఆ..  కలుసుకుంటే మౌనం
మనసు.. మనసు.. తెలుసుకుంటే గానం 



చరణం 4 :


నా సందిటిలో నిన్నదుముకుంటే...
ఈ సందడి ఇక తగదని నేనంటే.. అంటే
ఆ మాటంటే వస్తుంది కోపం...
ఆగాగు చూస్తుంది నాలోని రూపం... నీ రూపం




కనులు.. కనులు.. కలుసుకుంటే మౌనం
మనసు.. మనసు.. తెలుసుకుంటే గానం


ఆ మౌనానికి మరో పేరే అనుబంధం
ఆ గానానికి మరో రూపమే అనురాగం


కనులు.. ఆ.. కనులు.. ఆ..  కలుసుకుంటే మౌనం
మనసు.. మనసు.. తెలుసుకుంటే గానం






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4059

No comments:

Post a Comment