Friday, March 31, 2017

జిగినక.. అంబ పలుకు

చిత్రం : ఇద్దరు దొంగలు (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 

పల్లవి :

జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్

జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా

జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్

జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా

జిగినక.. జిగిజిగినక...
అరే... జిగినక.. జిగిజిగినక... 

చరణం 1 :

రాక రాక వచ్చినావు రాతిరంతా నీదోనురోయ్... హహ
వచ్చినాక వెళ్ళలేవు రాపిడంతా నాదేనురోయ్... హా

అహాహా... నంగనాచి రంగసాని దొంగసొత్తు దోచెయ్యనా..హా
ఉంగరాల జుట్టు తీసి చెంగుముద్దు కాజేయ్యనా... హా 

ఈ దోపిడి వద్దుర మావా... మరి రాతిరికెట్టా భామా
తీగదాక సాగినాక పోకచెక్కలివ్వమంటే పొద్దుపోదు తెలుసా

జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్
అరే... జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా

జిగినక.. జిగిజిగినక...
జిగినక.. జిగిజిగినక...

చరణం 2 :

చీకటింటికొచ్చినాక చీకుచింత తీర్చెయ్యనా...హా
సిగ్గు వచ్చిపోయినాక చీర నీకు కట్టెయ్యనా... హా

హహహ... సొమ్ములన్ని దోచుకుంటే సొమ్మసిల్లిపోతానురో..అయ్యయ్యో
సోకులన్నీ రాలిపోతే అమ్మతల్లి అంటానురో... 

అనుకోవే కృష్ణారామా... మరి బ్రతికేదెట్టా మావా
కాలమంతా చెల్లిపోతే కాయ కాస్త పండిపోతే... దిక్కులేదు తెలుసా

జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్

జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా

జిగినక.. జిగిజిగినక...
అరే... జిగినక.. జిగిజిగినక... 

 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2687

No comments:

Post a Comment