Wednesday, June 28, 2017

జగమే మారినది

చిత్రం : దేశద్రోహులు (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 




పల్లవి : 


ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...
జగమే మారినది మధురముగా ఈ వేళ
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ 


చరణం 1 : 


మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత
అవి అందాల జంట
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత
అవి అందాల జంట 


నెనరూ కూరిమి ఈనాడే పండెను
నెనరూ కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింతా 


జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ 


చరణం 2 : 


విరజాజులా సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుక
తిరిగాడును తేనెటీగ తీయ్యదనము కోరి
అనురాగాలా తేలి 


ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో 


జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=567

No comments:

Post a Comment