Tuesday, September 19, 2017

ప్రేమకు నేను

చిత్రం : ముందడుగు (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల




పల్లవి : 


ఆ...  ఆ...  ఆ...  ఆ..
ప్రేమకు నేను పేదను కానూ
ప్రేమకు నేను పేదను కానూ
ఆకలని దప్పికని అడగకు నాన్నా
వేకువలు వెన్నెలలు లేవుర కన్నా



చరణం 1 :



కసితీరా నవ్వేందుకు లోకం ఉంది
కడుపారా ఏడ్చేందుకు..శోకం ఉంది
కసితీరా నవ్వేందుకు..లోకం ఉంది
కడుపారా ఏడ్చేందుకు..శోకం ఉంది


అక్కరకే రాని ఒక పాశం ఉంది..
అక్క అని.. తమ్ముడనీ బన్ధం ఉంది
ఈ బాధలో..ఓఓఓ..ఆ బంధమే కడుపు నింపుతోంది
కనులు తుడుస్తుంది... కనులు తుడుస్తుంది


ఆరారో..ఓ..ఆరారో..ఓ..
ఆరారో..ఓ..ఆరారో... ఓ.. 


ప్రేమకు నేను పేదను కానూ
ఆకలని దప్పికని అడగకు నాన్నా
వేకువలు వెన్నెలలు లేవుర కన్నా



చరణం 2 :




ఎవ్వరికీ అందనిదా చుక్కల లోకం
చీకటికి చింతలకి ఎంతో దూరం


ఎవ్వరికీ అందనిదా చుక్కల లోకం
చీకటికి చింతలకి ఎంతో దూరం



అక్కగా పుట్టినా అమ్మను నాన్నా
అన్నమై పుడతాను ఆకలి వేళా


ఆకాశమై నీకోసమే తారలన్ని నేనై ఎదురు చూచు వేళ
ఎదురు చూచు వేళ


ఆరిరో... ఆరారో..ఓ..ఆరారో..ఓ..
ఆరారో..ఓ..ఆరారో... ఓ..  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3262


No comments:

Post a Comment