Monday, September 4, 2017

సాయం పడితే తాయం పెడతా

చిత్రం :  ముగ్గురు మొనగాళ్ళు (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి



పల్లవి :


అహా.. అహా.. హహా.. హా..
సాయం పడితే తాయం పెడతా వస్తావ బావా
సాయం పడితే తాయం పెడతా వస్తావ బావా
కన్నెపిల్ల పైట కాస్త సద్దలేవా... తమరికిది మరియాదా


తాయం పెడితే సాయం పడతా... వస్తానే భామా
తాయం పెడితే సాయం పడతా... వస్తానే భామా
పైట జారలేదా... బావ సద్దలేదా
బిడియమే ఇక లేదా


సాయం పడితే తాయం పెడతా వస్తావ బావా
తాయం పెడితే సాయం పడతా... వస్తానే భామా



చరణం 1 :


ఎవరితోనే చెప్పుకోను... వివరమంతా విప్పుకోను
వయసులో ఉన్నదాన్ని...  బావయ్యో
తెలుసుకో ఉన్నదాన్ని... లేవయ్యో


ఏమి సాయం చేసుకోను.. ఎదకు గాయం చేసుకోను
అదుపులో ఉన్నవాణ్ణి... లేవమ్మో
వలపుకే కొత్తవాణ్ణి... పోవమ్మ


బావా... అందమే ఆడదై అడిగినా
అవసరానా ఆదుకోవా నవరసాలా నావాడా


సాయం పడితే తాయం పెడతా వస్తావ బావా
తాయం పెడితే సాయం పడతా... వస్తానే భామా



చరణం 2 :


వ్రతము చెడ్డ చిన్నవాణ్ణి... ఫలితమింకా రానివాణ్ణి
పరువుగా వున్నవాణ్ణి.. బుల్లమ్మో
పరువమే నాకు బోణీ... చిన్నమ్మో



వాటమంతా చూసుకున్నా... పాఠమంతా చెప్పుకున్నా
దిద్దుకో ముద్దులన్నీ...  సోగ్గాడా
చెరుపుకో హద్దులన్నీ.. సొంతోడా 


భామా.. కోరికే గోపికై అడిగితే...
రాసలీల ఆడుకోనా రేయి పగలు చినదానా


సాయం పడితే తాయం పెడతా వస్తావ బావా
తాయం పెడితే సాయం పడతా... వస్తానే భామా
కన్నెపిల్ల పైట కాస్త సద్దలేవా... తమరికిది మరియాదా


సాయం పడితే తాయం పెడతా వస్తావ బావా
తాయం పెడితే సాయం పడతా... వస్తానే భామా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2682

No comments:

Post a Comment