Sunday, October 29, 2017

పాడవే ఓ కోయిలా

చిత్రం  :  రఘురాముడు (1983)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల



పల్లవి :


పాడవే ఓ కోయిలా...
పాడవే ఓ కోయిలా...
శృతి చేసి నీలో సరాగం... చిగురించనీవే వసంతం...
వాడని... వసివాడని... నా ప్రేమ గీతం...



పాడవే ఓ కోయిలా...
పాడవే ఓ కోయిలా...
ఇన్నాళ్ళ నా జీవితాన.. నీ రాకతోనే వసంతం
ఆమని తొలిప్రేమని వినిపించు గీతం


పాడవే ఓ కోయిలా... 



చరణం 1 :


కాలాలు కర్పూరమై... కరగాలి కౌగిళ్ళలో
ఆ.. ఆ.. ఆ.. ఆ...
కాలాలు కర్పూరమై... కరగాలి కౌగిళ్ళలో


కలలన్నీ కనుపాపలై... మెరవాలి నీ కళ్ళలో


ఏమి రామకథ... ఎంత ప్రేమ కథ... ఏకమైతే ఇద్దరం
ఓడిపోనీ ప్రేమ ముందు... ఓడిపోతే... ఒక్కరం
మధురమూ... మధురాక్షరం... మన ప్రేమ గీతం



పాడవే ఓ కోయిలా...
ఇన్నాళ్ళ నా జీవితాన... చిగురించనీవే వసంతం...
వాడని... వసివాడని... నా ప్రేమ గీతం
పాడవే ఓ కోయిలా...




చరణం 2 :



హరివిల్లు ఈ నేల పై... వెలసేను సిరి ఇల్లుగా
హా.. ఆ.. ఆ... ఆ..
హరివిల్లు ఈ నేల పై... వెలసేను సిరి ఇల్లుగా


సిరులున్న చిరునవ్వులే శ్రీవారు వెదజల్లగా 


తీపి వేదనల తేనె వెల్లువల తేలిపోనీ జీవనం
గాలి సోకి పూలు పూసే గాఢమైనా యవ్వనం
అంకితం... పునరంకితం... నా జీవితాంతం




పాడవే ఓ కోయిలా...
శృతి చేసి నీలో సరాగం... నీ రాకతోనే వసంతం
ఆమని తొలిప్రేమని వినిపించు గీతం


పాడవే ఓ కోయిలా...




No comments:

Post a Comment