Thursday, November 30, 2017

అయ్యయ్యో బంగరు బాబు

చిత్రం :  బంగారు బొమ్మలు (1977)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

లాలో... లలలలల... లాలో.... 

అయ్యయ్యో బంగరు బాబు... అయ్యయ్యో బంగరు బాబు

సెలయేరులాగా గలగల నవ్వులు రవ్వల రువ్వి 

చిరుగాలిలాగా తగిలీ తగలక గిలిగింతలు పెట్టి...

నన్ను తరుముకు వచ్చి తలపులు తలచేదెవరు... ఎవరు ఎవరు...

నేనే... నేనే... నేనే...

అమ్మమ్మో బంగరు బొమ్మ... అమ్మమ్మో బంగరు బొమ్మ

సెలయేరులాగా గలగల నవ్వులు రవ్వల రువ్వి

చిరుగాలిలాగా తగిలీ తగలక గిలిగింతలు పెట్టి...

నిన్ను  తరుముకు వచ్చి వెంటాడేది నేను... నేను... నేనే... 

అయ్యయ్యో బంగరు బాబు... అమ్మమ్మో బంగరు బొమ్మ 

చరణం 1 :

మరపురాని ఒక మధుర గాధలా...
కరిగిపోని ఒక కమ్మని కలలా....
గురుతురానీ గత జన్మస్మృతిలా....
మనసు మూలలను వెతుకుతున్నది... ఎవరు.. ఎవరు... ఎవరు...

చెరిగిపోని చిననాటి చెలిమిలా...
తరువు లేని సెలయేటి పాటలా....
నిలకడైన ఒక మెరుపు తీగలా...
మనసు మూలలను వెతుకుతున్నది నేనే... నేనే... నేనే...

అయ్యయ్యో బంగరు బాబు... అమ్మమ్మో బంగరు బొమ్మ
రాధా....

చరణం 2 :

యాడ నుంచి వచ్చినావురా... నన్నేడ కలుసుకున్నావురా
యాడ నుంచి వచ్చినావురా... నన్నేడ కలుసుకున్నావురా

ఎంత గురుతు తెచ్చినా... ఎంత తరచి చూచినా
ఎంత గురుతు తెచ్చినా... ఎంత తరచి చూచినా
నీ జాడ తెలియకుందిరా.... నన్నేడిపించకొదలరా
యాడ నుంచి వచ్చినావురా... నన్నేడ కలుసుకున్నావురా

ఈడనే వున్నానులే... నీ నీడనై వున్నానులే....
ఈడనే వున్నానులే... నీ నీడనై వున్నానులే....

ఎంత మరచిపోయినా.... ఎంత మనసు మారినా
ఎంత మరచిపోయినా.... ఎంత మనసు మారినా
నీ కలతలోనే ఋజువుంది...  నా కథలు నీకు చెబుతుంది
ఈడనే వున్నానులే... నీ నీడనై వున్నానులే....
నీ నీడనై వున్నానులే.... నీ నీడనై వున్నానులే

చరణం 3 :

ఎంత తపస్సు చేసైనా... ఎన్ని జన్మలు ఎత్తైనా...
నీ వాడుగా క్షణమైన బ్రతుకుతాను... ఓహో..ఓహో...
నీ ఒడిలో ప్రాణాలే వదులుతాను... అహాహ... అహ...హా
వదలను వదలను వదలను... నిన్ను వదలను వదలను వదలను...
నా వలపే ఒక కలగా నేననుకోను... ననుకోను... ననుకోను...

ఎంత తపస్సు చేసైనా... ఎన్ని జన్మలు ఎత్తినా...
నీ దాన్ని ఎన్నటికీ కాలేను... నీ దారి ఏనాడు రాలేను
దొరకను  దొరకను దొరకను.. నీకు దొరకను  దొరకను దొరకను
నీ కథలూ.. నీ మాటలు.. నే నమ్మను నమ్మను నమ్మను....

అయ్యయ్యో బంగరు బాబు... అయ్యయ్యో బంగరు బాబు

సెలయేరులాగా గలగల నవ్వులు రవ్వల రువ్వి 

చిరుగాలిలాగా తగిలీ తగలక గిలిగింతలు పెట్టి...

నన్ను తరుముకు వచ్చి తలపులు తలచేదెవరు... ఎవరు ఎవరు...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1766

No comments:

Post a Comment