Thursday, November 30, 2017

నేను నేనుగా... నీవు నీవుగా

చిత్రం :  బంగారు బొమ్మలు (1977)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల
పల్లవి :నేను నేనుగా... నీవు నీవుగా... వేరు వేరుగా
నిలువలేమూ క్షణమైనా... నిలువలేమూ క్షణమైనా

నేను నేనుగా... నీవు నీవుగా... వేరు వేరుగా
నిలువలేమూ క్షణమైనా... నిలువలేమూ క్షణమైనాచరణం 1 :

చెలిమి పాదులో వలపే పెరగాలి... ఆ వలపు తోటలో కలలే పండాలి

ఆ కలలే మన జీవితాలకు కమ్మని మత్తివ్వాలి
ఆ కలలే మన జీవితాలకు కమ్మని మత్తివ్వాలి
ఆ మత్తున తేలి మైమరచి మనమెవ్వరమో మరవాలి...

నేను నేనుగా... నీవు నీవుగా... వేరు వేరుగా
నిలువలేమూ క్షణమైనా... నిలువలేమూ క్షణమైనా 
చరణం 2 :
ఏడు సముద్రాలవతలి ఒడ్డున గూడు కట్టుకొని ఉందాము
మూడులోకములు ముద్దగ చేసి మరోలోకమును సృష్టిద్దాము 

నీవు సూర్యుడుగా... నేను జాబిలిగా.... ఏలుదాము కాలాన్ని...

నేను నేనుగా... నీవు నీవుగా... వేరు వేరుగా
నిలువలేమూ క్షణమైనా... నిలువలేమూ క్షణమైనా 
చరణం 3 :

గుండె గుండెలో దూసుకుపోవాలి...
ఆ గుండెలు రెండూ గుడిగా మారాలి
గుండె గుండెలో దూసుకుపోవాలి...
ఆ గుండెలు రెండూ గుడిగా మారాలి

ఆ గుడిలో మన ప్రేమ దేవతే కొలువు తీరి ఉండాలి

ఆ కొలువున మనమూ ప్రమిదలమై కోటి జన్మలే ఎత్తాలి 

నేను నేనుగా... నీవు నీవుగా... వేరు వేరుగా
నిలువలేమూ క్షణమైనా... నిలువలేమూ క్షణమైనా 

నేను నేనుగా... నీవు నీవుగా... వేరు వేరుగా
నిలువలేమూ క్షణమైనా... నిలువలేమూ క్షణమైనా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1767

No comments:

Post a Comment