Sunday, December 3, 2017

భలే భలే అందాలు సృష్టించావు

చిత్రం : భక్త తుకారాం (1973)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత : వీటూరి
నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి :



ఆ...  నందన వనముగ
ఈ లోకమునే సృష్టించిన
ఓ...  వనమాలి
మరచితివో మానవజాతిని దయమాలి..


భలే భలే అందాలు సృష్టించావు...  ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం...  ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు... 




చరణం 1 :



మాటలు రాని మృగాలు సైతం..  మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి.. మారణహోమం సాగించేను


మనిషే పెరిగి మనసే తరిగి..
మనిషే పెరిగి మనసే తరిగి.. మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు?


భలే భలే అందాలు సృష్టించావు...  ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం...  ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు..



చరణం 2 :



ఆ...ఆ... ఆ... ఆ...ఆ..ఆ...ఆ... ఆ... ఆ...ఆ..
చల్లగ సాగే సెలయేటి ఓలే.. మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వల ఓలే.. అందరు ఒక్కటై నివసించాలి


స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని..
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి


భలే భలే అందాలు సృష్టించావు..  ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం..  ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1185

1 comment: