Showing posts with label ఆదినారాయణరావు. Show all posts
Showing posts with label ఆదినారాయణరావు. Show all posts

Thursday, September 24, 2020

దినకరా... జయకరా




చిత్రం : సతీ అనసూయ (1971)

సంగీతం : ఆదినారాయణరావు 

గీతరచయిత : సినారె  

నేపథ్య గానం : సుశీల 


పల్లవి :



దినకరా... జయకరా 

పావనరూపా... జీవనదాతా 

దినకరా... జయకరా 

పావనరూపా... జీవనదాతా  


దినకరా... జయకరా 



చరణం 1 : 



ప్రథమకిరణం సోకిననాడే

ప్రాణవల్లభుని పొందితి గాదా

మంగళకరములు నీ కిరణమ్ములు

మాంగల్యమునే హరియించునా 


దినకరా... జయకరా 

పావనరూపా... జీవనదాతా  


దినకరా... జయకరా 



చరణం 1 :


లోకములన్నీ వెలిగించు దేవా 

నా కనువెలుగే తొలగించేవా 

కరుణాసింధూ... కమలబంధూ  

ఉదయించకుమా ఓ సూర్యదేవా 


చండకిరణ బ్రహ్మాండ కటోహోద్దండ తమో హరణా

సకల చరాచర నిఖిల జగజ్జన చైతన్యోద్దరణా

ద్వాదశాదిత్య రూపా.. రోదసీ కుహర దీపా 

ద్వాదశాదిత్య రూపా.. రోదసీ కుహర దీపా 

ఉదయించకుమా... ఉదయించకుమా... ఉదయించకుమా



Wednesday, September 23, 2020

హిమగిరి మందిరా... గిరిజా సుందరా





చిత్రం : సతీ అనసూయ (1971)

సంగీతం : ఆదినారాయణరావు 

గీతరచయిత : సముద్రాల (సీ) 

నేపథ్య గానం : సుశీల 


పల్లవి :



హే ప్రభో.........

గరళమ్ము మ్రింగి లోకములనే కాపాడి

ధరణిపై దయబూని సురగంగ విడనాడి

ప్రమథుల కొలువులో పరవశించేవా 

తాండవార్భటిలోన తనువు మరచేవా  


హిమగిరి మందిరా... గిరిజా సుందరా 

హిమగిరి మందిరా... గిరిజా సుందరా  

కరుణా సాగరా మొరవిన రారా 

హిమగిరి మందిరా.....


చరణం 1 :


భుజంగ భూషణా... అనంగ భీషణా 

భుజంగ భూషణా... అనంగ భీషణా 

కరాళ జ్వాల లెగసెరా  

కావగ రారా... ప్రభో శంకరా 

హిమగిరి మందిరా... గిరిజా సుందరా

కరుణా సాగరా మొరవిన రారా 



హిమగిరి మందిరా... గిరిజా సుందరా  

కరుణా సాగరా మొరవిన రారా 

హిమగిరి మందిరా.....


చరణం 2 :



పతి సేవనమే జీవనమై నిలిచిన నేను

పలు నిందలతో గుండెపగిలి కుందితి నేడు

పతి సేవనమే జీవనమై నిలిచిన నేను

పలు నిందలతో గుండెపగిలి కుందితి నేడు


జాటాచ్చటాధర... జగద్భయంకరా 

జాటాచ్చటాధర... జగద్భయంకరా 

దురంత మాపివేయగా 

పరుగున రారా ప్రభో ఈశ్వరా 




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8364

ఆలయమేలా... అర్చనలేలా




చిత్రం : సతీ అనసూయ (1971)

సంగీతం : ఆదినారాయణరావు 

గీతరచయిత : సినారె 

నేపథ్య గానం : సుశీల




పల్లవి :



ఆలయమేలా... అర్చనలేలా... ఆరాధనలేలా 

పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 

అదే సతి పెన్నిధి కాదా

అదే పరమార్థము కాదా


పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 

అదే సతి పెన్నిధి కాదా

అదే పరమార్థము కాదా


ఆలయమేలా... అర్చనలేలా... ఆరాధనలేలా 



చరణం 1 :


ఏ కొండ కొమ్ముపైనో... ఏ రాతి బొమ్మలోనో

దైవమ్ము దాగెనంటూ తపియించనేలా

ఏ కొండ కొమ్ముపైనో... ఏ రాతి బొమ్మలోనో

దైవమ్ము దాగెనంటూ తపియించనేలా


ఆ దైవము నిజముగ ఉంటే... 

అడుగడుగున తానై ఉంటే

గుడులేలా యాత్రలేలా 


పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 

అదే సతి పెన్నిధి కాదా

అదే పరమార్థము కాదా


ఆలయమేలా... అర్చనలేలా... ఆరాధనలేలా 



చరణం 2 :


పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం

మదిలోన వెలిగే అందం గమనించునా 

పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం

మదిలోన వెలిగే అందం గమనించునా 



ఈ లోకులతో పనియేమి... పలుగాకులు ఏమంటేమీ 

నా స్వామి తోడురాగా  


పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 

అదే సతి పెన్నిధి కాదా

అదే పరమార్థము కాదా


ఆలయమేలా... అర్చనలేలా... ఆరాధనలేలా 

ఆరాధనలేలా... ఆరాధనలేలా 




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8365

Saturday, September 5, 2020

మూడుముళ్లు పడిన నాడే




చిత్రం : కన్నవారిల్లు (1978)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం: బాలు, సుశీల, రామకృష్ణ 


పల్లవి :


మూడుముళ్లు పడిన నాడే
ముగ్గురమైనాములే... నలుగురమవుదాములే
ఏడు అడుగులు నడిచిన నాడే                   
ఇద్దరమయ్యాములే... ఒకటై ఉందాములే


చరణం 1 :


సంసారమంటే సంగీతమే...ఆ... ఆ... ఆ.. ఆ..
సంసారమంటే సంగీతమే... అనురాగమనురాగ రసగీతమే
మొదట మోహమై...  మధుర స్నేహమై
మొదట మోహమై మధురస్నేహమై
కడకు మోహనై పల్లవించు ప్రేమ


మూడుముళ్లు పడిన నాడే
ముగ్గురమైనాములే... నలుగురమవుదాములే 



చరణం 2 :


చీకటిలో బిగికౌగిలిలో చిమచిమలాడింది
మనసు జివ్వున లాగింది
వెన్నెలలో చెలి వన్నెలలో... నవనవలాడింది
వయసు నవ్వులు రేగింది


నిలువు దోపిడి చెేయాలంటే  జాబిలి చూడని కౌగిలి అందం
అహహ.. అహహ.. హ...
కనులగారడి చెేయాలంటేకౌగిలిలో కవ్వింతలు అందం
అహహ.. అహహ.. హ... లలల...
దాచే అందం దోచే చందం పూచే బంధం మన సొంతం



చరణం 3 :


గుసగుసల తేలి ఘుమఘమల సోలి సందిటను వాలి
ఈనాడు నా ఈడునీతోడు కోరిందిలే
గుసగుసల తేలి


అనురాగమంత చెలరేగినంత ఆలాపనైపోయి
రేయి హాయి ఝుమ్మందిలే
నినుచేరినంత నాకున్నదంత నీసొంతమై
పూలుపూచి దాచి రమ్మందిలే
చిలిపి కళలే వలపు వలలే పలకరించె
ఈనాడు నా ఈడు నీతోడు కోరిందిలే... గుసగుసలతేలి



చరణం 4 :


రాతకొద్ది దొరికాడు రాజకీయనాయకుడు
చేతకానిలేనివాడు చేసుకున్న నామొగుడు
రాతకొద్ది దొరికాడు
సామాజిక సమస్యలకు సతమతమయ్యి
ఛస్తుంటే సరసాలనికి కోరికేది


అయ్యొరామ... దొరగారికి తీరికేది
అయ్యొరామ... దొరగారికి తీరికేది
చెమటోడ్చే కడుపేడ్చే శ్రమజీవులు
పస్తుంటే వలపన్నది ఒక నేరం


అయితే బావ మనమిక సుఖపడనేరం
అయితే బావ మనమిక సుఖపడనేరం
ప్రజాసేవకంకితం సదా నాదుజీవితం
అయినా ప్రయారిటీ నీదే పదా పడుకుందాం... పదా పడుకుందాం





Tuesday, September 1, 2020

విరిసిన ఆనంద దీపావళి




చిత్రం : కన్నవారిల్లు (1978)
సంగీతం : ఆదినారాయణరావు
నేపథ్య గానం :  సుశీల



పల్లవి :


విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి 



చరణం 1 :


కన్నులలోన వెన్నెల వాన
కౌగిలిలోన గారాల కూన
మా పాటకు పల్లవి మీరు
మా తోటకు మల్లెలు మీరు
మా కంటికి దివ్వెలు మీరు
మా పండగనవ్వులు మీరు
చీకటివాకిట ముగ్గుల ముంగిట దీపాలే మీరు 



విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి 



చరణం 2 :



తామరపువ్వు తమ్ముడి నవ్వు
కానుక మాకు కావాలి ఇవ్వు
పండుగ వచ్చేయేడు మాతోడుగ వాడుంటాడు
పూవత్తులు వెలిగిస్తాడు పున్నమలే పండిస్తాడు
చుక్కల పందిట అక్కల సందిట జాబిల్లే వాడు


విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి 



చరణం 3 :


పిల్లల నోట చల్లని మాట
పండగ పూట రతనాల మూట
ఈ పాపల కోరికలన్ని మా పాలిటి దీవెనలైతే
ఆ నింగిని తారకలన్ని మాయింటికి దీపాలైతే
రేపులు మాపులు దేవుని చూపులు చల్లనివే మనకు



విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి 





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8054

Sunday, December 3, 2017

భలే భలే అందాలు సృష్టించావు

చిత్రం : భక్త తుకారాం (1973)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత : వీటూరి
నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి :



ఆ...  నందన వనముగ
ఈ లోకమునే సృష్టించిన
ఓ...  వనమాలి
మరచితివో మానవజాతిని దయమాలి..


భలే భలే అందాలు సృష్టించావు...  ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం...  ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు... 




చరణం 1 :



మాటలు రాని మృగాలు సైతం..  మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి.. మారణహోమం సాగించేను


మనిషే పెరిగి మనసే తరిగి..
మనిషే పెరిగి మనసే తరిగి.. మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు?


భలే భలే అందాలు సృష్టించావు...  ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం...  ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు..



చరణం 2 :



ఆ...ఆ... ఆ... ఆ...ఆ..ఆ...ఆ... ఆ... ఆ...ఆ..
చల్లగ సాగే సెలయేటి ఓలే.. మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వల ఓలే.. అందరు ఒక్కటై నివసించాలి


స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని..
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి


భలే భలే అందాలు సృష్టించావు..  ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం..  ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1185

Friday, November 10, 2017

రాజశేఖరా... నీపై మోజు తీరలేదురా

చిత్రం : అనార్కలి (1955)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : జిక్కి, ఘంటసాల  

 


సాకి :


మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయన చకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి... 
అనార్కలి...  అనార్కలి... అనార్కలి ...
వహ్వా 




పల్లవి : 



ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
రాజశేఖరా నీపై...  మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై...  మోజు తీరలేదురా
రాజసాన ఏలరా.....
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..రాజశేఖరా 

ఆ.. ఆ.. ఆ...ఆ.. ఆ.. ఆఆ.. ఆ.. ఆ
 రాజశేఖరా...  నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా....
రాజశేఖరా.... 



చరణం 1 :



మనసు నిలువ నీదురా... మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా... మమత మాసిపోదురా
మధురమైన బాధరా... మరపురాదు... ఆ...  ఆ..
 


రాజశేఖరా...  నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా....
రాజశేఖరా.... 



చరణం 2 :



కానిదాన కాదురా...  కనులనైన కానరా
కానిదాన కాదురా...  కనులనైన కానరా
జాగుసేయనేలరా...  వేగ రావదేలరా
జాగుసేయనేలరా...  వేగ రావదేలరా
వేగ రారా...  వేగ రారా...  వేగ రారా.. 









జీవితమే సఫలము

చిత్రం : అనార్కలి (1955)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : జిక్కి  




పల్లవి : 



ఆ... ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ..
జీవితమే సఫలము
జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమకథా మధురము


జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమకథా మధురము
జీవితమే సఫలము



చరణం 1 :



హాయిగా..  తీయగా..  ఆలపించు పాటలా
హాయిగా..  తీయగా..  ఆలపించు పాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా
వరాల సొయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా


అనారు పూలతోటలా...  అనారు పూలతోటలా
ఆశ దెలుపు ఆటలా


జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమకథా మధురము
జీవితమే సఫలము



చరణం 2 :



వసంత మధుర సీమలా...  ప్రశాంత సాంధ్యవేళలా
వసంత మధుర సీమలా...  ప్రశాంత సాంధ్యవేళలా


అంతులేని వింతలా...  అనంతప్రేమ లీలగా
అంతులేని వింతలా...  అనంతప్రేమ లీలగా
వరించు భాగ్యశాలులా...  వరించు భాగ్యశాలులా
తరించు ప్రేమ జీవులా


జీవితమే సఫలము
రాగసుధా భరితము ప్రేమకథా మధురము
జీవితమే సఫలము... ఈ జీవితమే సఫలము






Thursday, June 22, 2017

పలికే వారుంటే హృదయము

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల



పల్లవి : 



సరిగమ పదనిసానిదప మగరిస...  అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై...  ఎదురై


పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై...  ఎదురై


పలికే వారుంటే...
సరిగమ పదని సానిదప మగరిసని





చరణం 1 :


ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు


ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమవిధాత... జీవననేత ప్రేమవిధాత
అను గుడిగంట విను ప్రతి జంట


సరిగమ పదని సానిదప మగరిసని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే



చరణం 2 :



తీగా తీగా పెనగీ పెనగీ
రాగ ధారగా సాగీ సాగీ


తీగా తీగా పెనగీ పెనగీ
రాగ ధారగా సాగీ సాగీ
జీవన గంగావాహిని కాదా
జీవన గంగావాహిని కాదా
అను ప్రతి జంట విను గుడిగంట
సరిగమ పదని సానిదప మగరిసని


పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే

వలచే మనసుకు బదులుగ...  బదులుగ
పిలిచే కనులకు ఎదురై ... ఎదురై


పలికే వారుంటే...
సరిగమ పదని సానిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2063

ఏడవకే చిన్నారి పాపా

చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల



పల్లవి : 



ఏడవకే చిన్నారి పాపా... చిట్టి పాపా..ఆ
చూడలేనే కన్నీరు పాపా..
ఆ....  ఆ....  ఆ....
నీవు పెరగాలి మరవాలి శోకం..రేపు పాడాలి ఆనంద గీతం
ఆ..ఆ..... ఆ....ఆ..ఆ..... ఆ...... ఆ..ఆ..ఆ




చరణం 1 :


కారు మేఘాల చీకట్ల క్షోభ... నేడేనమ్మా..
రేపు శతకోటి కిరణాలశోభ... నీదేనమ్మా..
ఆశలన్నీ....పూచునమ్మా..
ఆశలన్నీ... పూచునమ్మా ....
కాంతులీన కాలిపోవు దీపమౌదు తృప్తిగాను....  తల్లీ..



జీవింతు నీ కొరకు..మళ్ళీ
ఏడవకే చిన్నారి పాపా..చిట్టి పాపా చూడలేనే కన్నీరు పాపా 




చరణం 2 :



నిన్ను లతలాగ కన్నీట తడిపీ...పెంచేనమ్మా..
రక్తమాంసాల త్యాగాల ఎరువు... వేసేనమ్మా..ఆ
చిగురు వేసి విరులు పూచి... చిగురు వేసి విరులు పూచి
మూడుపూవులారుకాయలగుచు నీవు నవ్వవలెను
తల్లీ..ఈ.. ఈ..జీవింతు నీ కొరకు మళ్ళీ 


ఏడవకే చిన్నారి పాపా... చిట్టి పాపా
చూడలేనే కన్నీరు పాపా...
నీవు పెరగాలి మరవాలి శోకం... రేపు పాడాలి ఆనంద గీతం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2202

కృష్ణా.... నా మొర వినవా

 చిత్రం :  కళ్యాణ మంటపం (1971)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల



పల్లవి : 



కృష్ణా.... నా మొర వినవా నను దయగనవా..
కన్నె బ్రతుకు కాపాడరావా..
ఈ ఘోరబలి ఆపించలేవా... ఆపించలేవా..


నా మొర వినవా.. నను దయగనవా
దీనులబ్రోచే దైవము కావా..
ఏనాడైనా వరమడిగితినా
ఈ వరమైనా ఈయగలేవా....  కృష్ణయ్యా కరుణించవయ్యా



చరణం 1 :


ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా
ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా
ఓటమి కలిగే ఆశలు తొలగే..ఈ ఘోరానికె తలవంచె
జగమింతేనా... బ్రతుకింతేనా..


నా మొర వినవా నను దయగనవా




చరణం 2 :



మగువను లోకం బానిస చేయగ... మౌనం పూనావా..
తాళికి తరుణిని దూరం చేయగ.. జాలే మరిచావా..
న్యాయం విడిచావా..ఘోరం తలిచావా..
వినవేలా... శిలవేనా... రావేలా... కృష్ణా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2201





Wednesday, March 22, 2017

ఏ వేళనైన ఒకే కోరికా

చిత్రం : చండీప్రియ (1980)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :


ఏ వేళనైన ఒకే కోరికా... ఏ పూవులైనా ఒకే మాలిక
ఇలాగే పాడాలి... కలకాలం
ఇలాగే పాడాలి... కలకాలం


ఏ వేళనైన ఒకే కోరికా... ఏ పూవులైనా ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్




చరణం 1 : 



అరవిరిసే కనులే...  కమలాలు
ముసురుకునే కురులే... భ్రమరాలు



మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే
మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే
దిగిరావా నీలాల గగనాలు... 


ఏ వేళనైన ఒకే కోరికా... ఏ పూవులైన ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్




చరణం 2 : 



కెహెతా హై ప్యాసా మన్ మేరే సాజన్
ఖిల్తా రహే అబ్ మై ఆజ్ సావన్


మెరిసే నీ నవ్వులే జల్లులైతే
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
పరువాలే శ్రావణ మేఘాలు 


ఏ వేళనైన... ఒకే కోరికా...
ఏ పూవులైన...  ఒకే మాలిక


యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమ్ జనమ్ 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2658

Wednesday, October 5, 2016

గువ్వలా ఎగిరిపోవాలి




చిత్రం :  అమ్మకోసం (1970)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు



పల్లవి :



ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఓ..ఓహొ..హో..
హేహేయ్...
గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ..
గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ..



చరణం 1 :



ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో...  మూగకన్నీరు మిగిలెను కనుపాపలో
ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో...  మూగకన్నీరు మిగిలెను కనుపాపలో 


ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే...
ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే...
చల్లని ఆ చేయి కావాలి....  ఆమె చెరణాలపై వాలిపోవాలి



గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ




చరణం 2 :



జగమంత ఒక వింత చదరంగము...  పాడు విధియేమో కనరాని సుడిగుండము
జగమంత ఒక వింత చదరంగము... పాడు విధియేమో కనరాని సుడిగుండము 

ఆ లోతులు చూసీ రీతులు తెలిసీ
ఆ లోతులు చూసీ రీతులు తెలిసి...
అలలాగా చెలరేగి పోవాలి... నేననుకున్న గమ్యం చేరాలీ



గువ్వలా ఎగిరిపోవాలి.. ఈ..ఈ..ఈ..
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ... ఈ..ఈ..ఈ








Thursday, May 19, 2016

జగదీశ్వరా... పాహి పరమేశ్వరా





చిత్రం :  సువర్ణ సుందరి (1957)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  సుశీల 




పల్లవి :



ఓం నమశ్శివాయః...  సిద్ధం నమః
ఓం...
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా...  పాహి పరమేశ్వరా..
దేవా పుర సంహర... ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..



చరణం 1 :



శంభోహరా... వినుత లంబోదరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా... వినుత లంబోదరా..
అంబావర కావరా..


వరమీయరా..గౌరివరసుందరా... గౌరివరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవగంగాధరా


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా... పాహి పరమేశ్వరా..



చరణం 2 :



ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశంబున కొనియాడా..


ఓ.. ఓ.. ఓ.. ఓ..
ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశంబున కొనియాడా..
నడిపెడు సుందర నటనకు జతులిడు.. నందియ మర్దళ నాదమే..
మధురాతి మధుర శ్రుతి గీతమే...


.
తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలిక శివకామసుందరి నాయకా
జగంబులా ఏలిక శివకామసుందరి నాయకా



ఓ..ఓ..ఓ..ఓ...
ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార.. గని పారవశంబున కొనియాడా..






Monday, December 29, 2014

రేపల్లెలోని గోపాలుడంట

చిత్రం :  మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం :  ఆదినారాయణరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  రామకృష్ణ



పల్లవి :



ఆ.. రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట    


ఆ రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట 



చరణం 1 :


సుందరి జాణ బిందెలతోటి నీలాల రేవు కొచ్చిందట  
సుందరి జాణ బిందెలతోటి నీలాల రేవు కొచ్చిందట


కళ్ళు కోలాటమాడ మెచ్చిందంట
క్రిష్ణయ్య రాగా అహ కేరింతలాడ.. క్రిష్ణయ్య రాగా కేరింతలాడ 


పైట జారె బిందె జారె తెల్లబోయి పిల్లా జారె
పైట జారె బిందె జారె తెల్లబోయి పిల్లా జారె         


తలచుకుంటె ఆ వైనం నవ్వులపంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట 


చరణం 2 :



చక్కని చుక్క సందేళ గుళ్ళో.. మొక్కులు మొక్కంగ వచ్చిందంట
చక్కని చుక్క సందేళ గుళ్ళో.. మొక్కులు మొక్కంగ వచ్చిందంట  


అహ.. నిక్కుతు నీల్గుతు వచ్చిందంటా
నల్లనివాడు అల్లవరగా.. నల్లనివాడు అల్లవరగా
కళ్ళు కలిపే ఒళ్ళు మరిచే.. దూరాన మొగుడు కారాలు నూరె కళ్ళు
కళ్ళు కలిపే ఒళ్ళు మరిచే.. దూరాన మొగుడు కారాలు నూరె కళ్ళు


తలచుకుంటె ఆ రగడ రవ్వలమంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట



చరణం 3 :



అందాలభామ చిందులు వేయ అందలమెక్కి సాగిందంట
అందాలభామ చిందులు వేయ అందలమెక్కి సాగిందంట..
తన అందాలు కాస్త దాచిందంట


పిల్లనగ్రోవి మొల్లనవింటే.. హాయ్‌ పిల్లనగ్రోవి మొల్లనవింటే
మేనుపొంగి మేనా ఆపి.. తానేమొ క్రిష్ణయ్య సన్నిధి చేరె
మేనుపొంగి మేనా ఆపి.. తానేమొ క్రిష్ణయ్య సన్నిధి చేరె


తలచుకుంటె ఆ జోడి గువ్వలజంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ కన్నుల పంట





Monday, October 27, 2014

వస్తాడు నా రాజు ఈ రోజు

చిత్రం :  అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  సుశీల 





పల్లవి :


వస్తాడు నా రాజు ఈ రోజు.. రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీకపున్నమి వేళలోన.. కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీకపున్నమి వేళలోన.. కలికి వెన్నెల కెరటాలపైన
తేలివస్తాడు నా రాజు ఈ రోజు


చరణం 1 :




వేలతారకల నయనాలతో.. నీలాకాశం తిలకించేను
వేలతారకల నయనాలతో.. నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను


ఆతని పావన పాదధూళికై.. అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే.. పాలసంద్రమై పరవశించేను...  
పాలసంద్రమై పరవశించేను

వస్తాడు నా రాజు ఈ రోజు.. రానే వస్తాడు నెలరాజు ఈ రోజు


చరణం 2 : 


వెన్నెలలెంతగా విరిసినగానీ చంద్రుణ్ణీ విడిపోలేవు
కెరటాలెంతగా పొంగినగానీ కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు.. ఏ జన్మకు విడిపోలేవులే


తనువులు వేరైనా.. దారులు వేరైనా
తనువులు వేరైనా.. దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే.. 
ఆ బంధాలే నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు.. రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీకపున్నమి వేళలోన.. కలికి వెన్నెల కెరటాలపైన

వస్తాడు నా రాజు ఈ రోజు


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3074

తెలుగు వీర లేవరా

చిత్రం :  అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపథ్య గానం : ఘంటసాల,  రామకృష్ణ





పల్లవి :


ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ ఓ...


తెలుగు వీర లేవరా.. ఆ ఆ ఆ.. దీక్ష బూని సాగరా.. ఆ ఆ ఆ..
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా..


తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....



చరణం 1 :




దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ ఆ ఆ ....
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా.. ఆ ఆ ఆ .....
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా


నిదురవద్దు..బెదరవద్దు
నిదురవద్దు..బెదరవద్దు
నింగి నీకు హద్దురా.. నింగి నీకు హద్దురా
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ..... 


చరణం 2 : 


ఓ ఓ ఓ ఓ ఓ...
ఎవడువాడు?..ఎచటివాడు?
ఎవడు వాడు? ఎచటి వాడు?
ఇటువచ్చిన తెల్లవాడు


కండబలం కొండ ఫలం
కబళించే దుండగీడు.. కబళించే దుండగీడు
మానధనం.. ప్రాణధనం
దోచుకొనే దొంగవాడు.. దొచుకొనే దొంగ వాడు
ఎవ
డు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు

తగినశాస్తి చేయరా...తగిన శాస్తి చేయరా ...
తరిమి తరిమి కొట్టరా.... తరిమి తరిమి కొట్టరా..


తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా!
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా!
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ..... 




చరణం 3 :


ఈ దేశం... ఈ రాజ్యం...
ఈ దేశం ఈ రాజ్యం .. నాదే అని చాటించి.. నాదే అని చాటించి
ప్రతిమనిషి తొడలు గొట్టి...
శృంఖలాలు పగులగొట్టి..శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపెట్టి...
తుది సమరం మొదలుపెట్టి.. తుది సమరం మొదలుపెట్టి..


సింహాలై గర్జించాలీ... సింహాలై గర్జించాలీ
సంహారం సాగించాలీ... సంహారం సాగించాలీ


వందేమాతరం... వందేమాతరం..
వందేమాతరం... వందేమాతరం..

చరణం 4 :

ఓ ఓ ఓ ఓ ఓ...
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య భానుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య భానుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా


అందుకో మా పూజ లందుకో.. రాజా..
అందుకో మా పూజ లందుకో.. రాజా..
అల్లూరిసీతారామరాజా.. ఆ...అల్లూరిసీతారామరాజా..


ఓ ఓ ఓ ఓ ఓ...
తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా
మా  నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా
తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా
మా  నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా


త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం...
నిశ్చయముగ నిర్భయముగ.. నీ వెంటనే నడుస్తాం...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8803

Wednesday, October 8, 2014

హాయి హాయిగా ఆమని సాగే

చిత్రం :  సువర్ణ సుందరి (1957)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల, జిక్కి  




పల్లవి :



ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా.. ఆ ఆ ఆ.. హాయి సఖా.. ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే


లీలగా పువులు గాలికి ఊగా ఆ.. ఆ.. ఆ...
లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ.....లీలగా పువులు గాలికి వూగా
సనిదమ దనిసా గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని దని మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి ఊగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ..  జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే




చరణం 1 :


ఏమో... ఏమో తటిల్లతికమే మెరుపు
ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో
మొయిలురాజు దరి మురిసినదేమో.. మైమరపేమో
మొయిలురాజు దరి మురిసినదేమో


వలపు కౌగిలుల వాలి సోలి... వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా...  జంపాలగా ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే 


చరణం 2 :


ఆ ఆ ఆ ఆ ఆచూడుమా చందమామ.. అటు చూడుమా చందమామ

కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ...

ఆ ఆ ఆ.. చూడుమా చందమామ

వగలా తూలే విరహిణులా
వగలా తూలే విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా


ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా.. ఆ.. ఆ.. ఆ
హాయి హాయిగా ఆమని సాగే 



చరణం 3 :


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా..... కనుగ
వా తనియగా ప్రియతమా

కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగవా తనియగా


చెలువము కనుగొనా.. ఆ.. ఆ.. చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు సేయునోయీ
ఆనంద నాట్యాలు సేయునోయీ


సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని మదమద గమగమ గమ
దనిసా గమ దనిసా దనిసా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1507

పిలువకురా అలుగకురా

చిత్రం :  సువర్ణ సుందరి (1957)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  సుశీల 




పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ 


పిలువకురా అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..


పిలువకురా అలుగకురా....
నలుగురిలో నను ఓ రాజా.. ఆ..
పలుచన సలుపకురా..


పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ 



చరణం 1 :


మనసున బాళి మరువనులేర...
చలమున మోడి సలుపకు రాజా....
సమయము కాదురా  నిను దరిచేర..
సమయము కాదురా  నిను దరిచేర...


కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ 


చరణం 2 :


ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..


కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....


పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ 


Thursday, June 26, 2014

జాబిల్లి చూసేను

చిత్రం :  మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల



పల్లవి:



జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో
నాకెంత సిగ్గాయె బావా.. బావా.. నను వీడలేవా


పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో
నీకింత సిగ్గేల బాలా.. రావా నను చేరరావా



చరణం 1:


ఆ .. ఆ.. ఆ .. ఆ..

ఆకాశమార్గాన అందాల మేఘాలు... పెనవేసుకున్నాయి చూడూ
చిగురాకు సరదాలు.. చిరుగాలి సరసాలు.. గిలిగింతలాయేను నేడూ


అందచందాలతో .. ప్రేమ బంధాలతో ..
జీవితం హాయిగా సాగనీ ..ఈ..ఈ..
బాలా...  రావా... నను చేరరావా..


చరణం 2:


ఆ .. ఆ .. ఆ ..
ఆ కొమ్మపై ఉన్న అందాల చిలకలు.. అనురాగ గీతాలు పాడేనూ...
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద.. మైమరచి కలలందు కరిగేనూ...


ముద్దు మురిపాలతో .. భావరాగాలతో ..
యవ్వనం పువ్వులా నవ్వనీ..ఈ..ఈ..
బావా... బావా.. నను వీడలేవా...


చరణం 3:


ఆ .. ఆ ..
బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు.. కొనగోటి మీటులే కోరేనూ
నీ లేత అధరాలు ఎంతెంతొ మధురాలు .. ఈ నాడు నా సొంతమాయేనూ


దేవి దీవించెను .. స్వామి వరమిచ్చెను ..
ఇద్దరం ఏకమౌదాములే ..ఏ..ఏ..
బాలా.. రావా ..నను చేరరావా


జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. ఓయబ్బో..
నాకెంత సిగ్గాయె బావా.. బావా ..నను వీడలేవా


పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. ఓయమ్మో..
నీకింత సిగ్గేల బాలా.. రావా.. నను చేరరావా


ఆ..అహా...హ...
ఆ..ఆ...ఆ..ఆహా...
ఆ..అహ...హ..
ఆ...ఆ..ఆ..ఆ..అహా...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1758