Tuesday, December 5, 2017

ఏ తోటలో విరబూసెనో

చిత్రం :  బ్రహ్మచారి (1967)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు
నా ఇంటిలో విరజల్లెను చిరునవ్వు..ఊ... ఊ... ఊ


ఏ తోటలో విరబూసెనో... ఈ పువ్వు
ఈ చిరుత నవ్వులు..ఊ.. ఊ.. ఏ జంటపంటలో..ఓ... ఓ
ఈ చిలిపి కన్నులు..ఊ... ఊ..అవి ఏ వలపు కలలో..ఓ... ఓఓ


ఏ తోటలో విరబూసెనో... ఈ పువ్వు





చరణం 1 :


బ్రహ్మచారినే నాన్నను చేసి... పకపక కొంటెగ నవ్వేవు
బ్రహ్మచారినే నాన్నను చేసి... పకపక కొంటెగ నవ్వేవు


నీ నవ్వులో ఏమున్నదో మైకము...
నావాడవే అని నమ్మెను లోకము... 


ఏ తోటలో విరబూసెనో... ఈ పువ్వు


చరణం 2 :



పసిపాపంటే దేవుడురా... సత్యానికి నువు సాక్ష్యమురా
పసిపాపంటే దేవుడురా... సత్యానికి నువు సాక్ష్యమురా
ఎవరో అల్లిన కల్లలకు... నువ్వెందుకు పందిరివయినావు..ఊ... ఊ


ఏ తోటలో విరబూసెనో... ఈ పువ్వు
నా ఇంటిలో విరజల్లెను... చిరునవ్వు..ఊ... ఊ



చరణం 3 :



ఈ తోటలో ఒక మావిని... ఒక మాలతి
ప్రేమించినది తనదేనని... నమ్మినది
ఈ చిరుత నవ్వులు... ఆ జంట పంటలే
ఈ చిలిపి కన్నులు..ఊ.. ఊ.. ఆ వలపు కలలే







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1236

No comments:

Post a Comment