Showing posts with label బ్రహ్మచారి (1967). Show all posts
Showing posts with label బ్రహ్మచారి (1967). Show all posts

Tuesday, December 5, 2017

ఈ ఎన్నెల ఎలుగుల్లోన

 చిత్రం :  బ్రహ్మచారి (1967)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


ఈ ఎన్నెల ఎలుగుల్లోన...  ఎంకి నిన్ను ఎతుకుతువుంటే
ఏ చల్లని గాలి నిన్ను... ఎత్తుకు పోయింది బావా?
ఓ... నాయుడు బావా



చరణం 1 :


పైటగాలి ఇసురుల్లోనే.. పడిపోయా మైకంతోనే
నీ ఎంటే నీడగసాగి... నీ ఎదలో ఒదిగున్నానే
నీ ఎంటే నీడగసాగి... నీ ఎదలో ఒదిగున్నానే
నీ నవ్వుల ఎన్నెల్లోనే... మేడలు కట్టేనే ఎంకి..ఈ
నా చక్కని ఎంకి


ఈ ఎన్నెల ఎలుగుల్లోన.. ఎంకి నిన్ను ఎతుకుతువుంటే
ఏ చల్లని గాలి నిన్ను... ఎత్తుకు పోయింది బావా
ఓ...నాయుడు బావా




చరణం 2 :


మదనా రావోయీ ఒక్కసారి
ఎవ్వరూ లేని ఈ చోట ఇటు.. రా రా రా.. ఒక మాట
ఎవ్వరూ లేని ఈ చోట ఇటు.. రా రా రా.. ఒక మాట
నను కవ్వించే రతి రాజా.. నీ చెలిపైనే దయరాదా
ఎవ్వరూలేని ఈ చోట ఇటు.. రా రా రా.. ఒక మాట


విరజాజులకే పరిమళ మొసగే... నీ ముంగురులే ముద్దిడుకోనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విరజాజులకే పరిమళ మొసగే... నీ ముంగురులే..ముద్దిడుకోనా
స్వర్గమునైనా వలదనిపించే..  నీ కౌగిలిలో సోలిపోనా
ఎవ్వరూలేని ఈ చోట ఇటు.. రా రా రా.. ఒక మాట




చరణం 3 :



ఇరువుర మొకటై మురిసేవేళ... పూవుల వానలే కురియునులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇరువుర మొకటై..మురిసేవేళ... పూవుల వానలే..కురియునులే
తీయని వలపుల వూయలలోన... జగమంతా మై మరచునులే


ఎవ్వరూలేని ఈ చోట ఇటు..రా రా రా.. ఒక మాట
ఎవ్వరూలేని .. ఈ.. చోట





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1637

నిన్ను చూశాను... కన్ను వేశాను

 చిత్రం :  బ్రహ్మచారి (1967)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :
నేపధ్య గానం :   జానకి, జయదేవ్



పల్లవి :


నిన్ను చూశాను కన్ను వేశాను
చిన్న వీలు చూసి జేబులోన
వేశాను..వేశాను..వేశాను..మ్ హూ
ప్లాను వేశావు..పేరు మార్చావు
గండు పిల్లిలాగా.. ఇంటిలోనే
దూరావు..దూరావు... దూరావు



చరణం 1 :



పైన మేఘాలలో.. తేలిపోదామా..మ్ హూ
కింద పాతాళమే... చూసి వత్తమా.. ఆహహహ
ఓ బ్రహ్మచారి... డూప్లికేటుగారూ
కాస్త కళ్ళాలు... పట్టండి మీరు
మాట వినకుంటే పెసరట్లు తిందురు... అమ్మబాబోయ్


ప్లాను వేశావు... పేరు మార్చావు
గండు పిల్లిలాగా... ఇంటిలోనే
దూరావు..దూరావు..దూరావు


నిన్ను చూశాను... కన్ను వేశాను
చిన్న వీలు చూసి... జేబులోన
వేశాను..వేశాను..వేశాను..



చరణం 2 :



ఇంత కంగారు... పడతావు ఎందుకు?
చెంత వున్నాడు... నీ ఫ్రెండు జంకకూ... ఆహ్హా


నాన్న కెవరైన... మన ప్లాను చెప్పినా
వచ్చి నీ జోరు... నా జోరు చూసినా
వీపు కెనకాల... కాషాలు మోగవా


నిన్ను చూశాను..కన్ను వేశాను
చిన్న వీలు చూసి..జేబులోన
వేశాను..వేశాను..వేశాను..ఆహా


ప్లాను వేశావు..పేరు మార్చావు
గండు పిల్లిలాగా..ఇంటిలోనే
దూరావు..దూరావు..దూరావు



చరణం 3 :



బాగా డబ్బున్న... మా బక్క మామా
రెండు వేసినా... పడతానే భామా


అంత మాత్రానికే... వూరుకోరు
నిన్ను మెడపట్టుకొని... గెంటుతారు
అపుడు మనదారి... గోదారే సారూ


నిన్ను చూశాను... కన్ను వేశాను
చిన్న వీలు చూసి... జేబులోన
వేశాను..వేశాను..వేశాను..ఆహా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1638

బ్రహ్మచారీ నిన్నుకోరి

 చిత్రం :  బ్రహ్మచారి (1967)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :
నేపధ్య గానం :   జానకి, సుశీల



పల్లవి :


ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప


ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది... నిను చేరి
ఓ బ్రహ్మచారీ... నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది... నిను చేరి


ఆడపిల్ల కనపడితే... అయ్యయ్యా
అదిరి అదిరిపోతావు... మెమెమా
ప్రేమ పాఠములు చెబితే... అయ్యయ్యా
బెదిరి బెదిరి పోతారు... వెవెవె


పడక పడక ఆ గొడవలోన.. నువు పడనే పడ్డావు


ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి


ఓ బ్రహ్మచారీ... నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది... నిను చేరి




చరణం 1 :



గడుసుపిల్ల గురి చూసింది..యా..హాయ్
పడుచుదనం... వల వేసింది
యమమహ యమమహ యమమహ..ఆ


గడుసుపిల్ల గురి చూసింది..
పడుచుదనం వల వేసింది
చూసి చూసి నిను చేరదీసి
పెనవేసుకు పోతుంది..


ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది... నిను చేరి
ఆడపిల్ల కనపడితే... అదిరి అదిరిపోతావు


ఓ బ్రహ్మచారీ... నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది... నిను చేరి




చరణం 2 :



ఝుం ఝుం ఝుం..పరపపపపఝుం ఝుం ఝుం..పరపపపప

బెండకాయ ముదిరిందంటే...
దండగ దండగ దండగ..
బ్రహ్మచారి ముదిరాడంటే...
దండగ శుద్ధ దండగ
పాకం కుదిరిన పరువంలోనే
పండగ పండగ పండగ..ఆ


ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది... నిను చేరి
ఓ బ్రహ్మచారీ... నిన్నుకోరి
నిలుచున్నది చిన్నది... నిను చేరి


ఆడపిల్ల కనపడితే... అయ్యయ్యా
అదిరి అదిరిపోతావు... మెమెమా
ప్రేమ పాఠములు చెబితే... అయ్యయ్యా
బెదిరి బెదిరి పోతారు... వెవెవె


పడక పడక ఆ గొడవలోన.. నువు పడనే పడ్డావు



ఓ బ్రహ్మచారీ..హేయ్..నిన్నుకోరి..హేయ్
నిలుచున్నది చిన్నది..నిను చేరి
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప
ఝుం ఝుం ఝుం..పరపపపప





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1234

ఏ తోటలో విరబూసెనో

చిత్రం :  బ్రహ్మచారి (1967)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు
నా ఇంటిలో విరజల్లెను చిరునవ్వు..ఊ... ఊ... ఊ


ఏ తోటలో విరబూసెనో... ఈ పువ్వు
ఈ చిరుత నవ్వులు..ఊ.. ఊ.. ఏ జంటపంటలో..ఓ... ఓ
ఈ చిలిపి కన్నులు..ఊ... ఊ..అవి ఏ వలపు కలలో..ఓ... ఓఓ


ఏ తోటలో విరబూసెనో... ఈ పువ్వు





చరణం 1 :


బ్రహ్మచారినే నాన్నను చేసి... పకపక కొంటెగ నవ్వేవు
బ్రహ్మచారినే నాన్నను చేసి... పకపక కొంటెగ నవ్వేవు


నీ నవ్వులో ఏమున్నదో మైకము...
నావాడవే అని నమ్మెను లోకము... 


ఏ తోటలో విరబూసెనో... ఈ పువ్వు


చరణం 2 :



పసిపాపంటే దేవుడురా... సత్యానికి నువు సాక్ష్యమురా
పసిపాపంటే దేవుడురా... సత్యానికి నువు సాక్ష్యమురా
ఎవరో అల్లిన కల్లలకు... నువ్వెందుకు పందిరివయినావు..ఊ... ఊ


ఏ తోటలో విరబూసెనో... ఈ పువ్వు
నా ఇంటిలో విరజల్లెను... చిరునవ్వు..ఊ... ఊ



చరణం 3 :



ఈ తోటలో ఒక మావిని... ఒక మాలతి
ప్రేమించినది తనదేనని... నమ్మినది
ఈ చిరుత నవ్వులు... ఆ జంట పంటలే
ఈ చిలిపి కన్నులు..ఊ.. ఊ.. ఆ వలపు కలలే







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1236