Tuesday, December 5, 2017

నిన్ను చూశాను... కన్ను వేశాను

 చిత్రం :  బ్రహ్మచారి (1967)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :
నేపధ్య గానం :   జానకి, జయదేవ్



పల్లవి :


నిన్ను చూశాను కన్ను వేశాను
చిన్న వీలు చూసి జేబులోన
వేశాను..వేశాను..వేశాను..మ్ హూ
ప్లాను వేశావు..పేరు మార్చావు
గండు పిల్లిలాగా.. ఇంటిలోనే
దూరావు..దూరావు... దూరావు



చరణం 1 :



పైన మేఘాలలో.. తేలిపోదామా..మ్ హూ
కింద పాతాళమే... చూసి వత్తమా.. ఆహహహ
ఓ బ్రహ్మచారి... డూప్లికేటుగారూ
కాస్త కళ్ళాలు... పట్టండి మీరు
మాట వినకుంటే పెసరట్లు తిందురు... అమ్మబాబోయ్


ప్లాను వేశావు... పేరు మార్చావు
గండు పిల్లిలాగా... ఇంటిలోనే
దూరావు..దూరావు..దూరావు


నిన్ను చూశాను... కన్ను వేశాను
చిన్న వీలు చూసి... జేబులోన
వేశాను..వేశాను..వేశాను..



చరణం 2 :



ఇంత కంగారు... పడతావు ఎందుకు?
చెంత వున్నాడు... నీ ఫ్రెండు జంకకూ... ఆహ్హా


నాన్న కెవరైన... మన ప్లాను చెప్పినా
వచ్చి నీ జోరు... నా జోరు చూసినా
వీపు కెనకాల... కాషాలు మోగవా


నిన్ను చూశాను..కన్ను వేశాను
చిన్న వీలు చూసి..జేబులోన
వేశాను..వేశాను..వేశాను..ఆహా


ప్లాను వేశావు..పేరు మార్చావు
గండు పిల్లిలాగా..ఇంటిలోనే
దూరావు..దూరావు..దూరావు



చరణం 3 :



బాగా డబ్బున్న... మా బక్క మామా
రెండు వేసినా... పడతానే భామా


అంత మాత్రానికే... వూరుకోరు
నిన్ను మెడపట్టుకొని... గెంటుతారు
అపుడు మనదారి... గోదారే సారూ


నిన్ను చూశాను... కన్ను వేశాను
చిన్న వీలు చూసి... జేబులోన
వేశాను..వేశాను..వేశాను..ఆహా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1638

No comments:

Post a Comment