Wednesday, January 3, 2018

కళకళలాడె కన్నులు

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి  




పల్లవి :


కళకళలాడె కన్నులు... తహతహలాడే ఊహలు
కళకళలాడె కన్నులు... తహతహలాడే ఊహలు
ఘుమఘుమలాడే గుండెలూ... కులుకుచు వేసేను చిందులూ
కళకళలాడె కన్నులు... తహతహలాడే ఊహలు 


యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ
యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ
యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ


చరణం 1 :




పెదవులే దొండపండట... హృదయమే పూలచెండట
పెదవులే దొండపండట... హృదయమేపూలచెండట
పలుకులే పనసతొనలట... తలపులే వలపు గనులట
పలుకులే పనసతొనలట... తలపులే వలపు గనులట
నేను నీకైపూలతోటై... మినుటు యుగమై వేచేనూ
కనులువేయి ఎదురు చూచి... కాయ కాచి పండేను



కళకళలాడె కన్నులు... తహతహలాడే ఊహలు
ఘుమఘుమలాడే గుండెలూ... కులుకుచువేసేను చిందులూ
కళకళలాడె కన్నులు... తహతహలాడే ఊహలు 


యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ
యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ
యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ



చరణం 2 :



దొంగవై దారి కాయకోయ్... దురుసుగా కళ్ళుమూయకోయ్
దొంగవై దారి కాయకోయ్... దురుసుగా కళ్ళుమూయకోయ్
చిలిపిగా చిటిక వేయకోయ్... చెక్కిలీ నొక్కి చిదమకోయ్
చిలిపిగా చిటిక వేయకోయ్... చెక్కిలీ నొక్కి చిదమకోయ్


కొంటెపనులే చేయకుంటే కొసరి నిన్నే చేరేదా
జంటకోరీ వెంటనుంటే కంటిపాపై నవ్వేదా



కళకళలాడె కన్నులు... తహతహలాడే ఊహలు
ఘుమఘుమలాడే గుండెలూ... కులుకుచువేసేను చిందులూ
కళకళలాడె కన్నులు... తహతహలాడే ఊహలు 


లలలలలల్లల్లలా..లలలలలాలల్లల్లలా
లలలలలల్లల్లలా..లలలలలాలల్లల్లలా 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1111

No comments:

Post a Comment