Wednesday, January 3, 2018

మీ అందాల చేతులు

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్  
పల్లవి :

మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్... ఓ చేయ్ వేసేదా..ఆ..ఆ..ఆ.చరణం 1 :చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా..హోయ్..
ఉయ్యాలలూచే వయ్యారి చేతులు మోటారుతోలాలా
చిన్నారి మేను సన్నాని నడుము అల్లాడిపోవాలా..హోయ్..
ఉయ్యాలలూచే వయ్యారి చేతులు మోటారుతోలాలా

వింతైన సొంపు వన్నెలు తరిగి వాడిపోవాలా
ఇటు అప్టుడేటుగా టిప్పుటాపుగా అలసిపోవాలా..హోయ్
ఓ హో..హో..

మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదాచరణం 2 :
కాలేజి చదువుల తేలేవు గాని కాసింత తగ్గాలి..హోయ్..
వేలాది వేల రూపాయలున్నా వినయము చూపాలీ
కాలేజి చదువుల తేలేవు గాని కాసింత తగ్గాలి..హోయ్..
వేలాది వేల రూపాయలున్నా వినయము చూపాలీ
మగవాని తోడు వలదన్న వనిత మహిలోన కనరాదు
ఈ కోపమెందుకూ తాపమెందుకూ... తగునా ఇదినీకూ..హోయ్
ఓ..హో..హో..

మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా
చరణం 3  :కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను..హోయ్..
విడిదింటినుండి ఊరేగి నిన్నే పెళ్ళడవస్తాను
కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను..హోయ్..
విడిదింటినుండి ఊరేగి నిన్నే పెళ్ళడవస్తాను

మనసైనవాణ్ణి...  మామా అనగానే పోంగేను
ఈ మనసైనవాణ్ణి.. మామా అనగానే పోంగేను
ఇక వలపుదారిలో కలికి సేవలో కాలం గడిపేనూ..హోయ్..
ఓ..హో..హో..

మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయమువలదా..హోయ్..ఓ చేయ్ వేసేదా

No comments:

Post a Comment