Sunday, January 7, 2018

పసుపు తాడుకు ముడులు వేసి

చిత్రం :  రాగదీపం (1982)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం :  బాలు



పల్లవి : 


పసుపు తాడుకు ముడులు వేసి...  బంధమంటే సరి పోదు
ఏడూ అడుగులు నడిచినంతనే భార్య అంటే సరి కాదు...
సరిపోదు... సరి కాదు
పసుపు తాడుకు ముడులు వేసి...  బంధమంటే సరి పోదు 



చరణం 1 :



హృదయానికి హృదయం బంధం 
మరో హృదయానికి తెలియని అనుబంధం
ఏ అడుగు వేయలేనిది... ఎదురేమీ అడగలేనిది 



తాడు లేనిదీ... ముడులు లేనిదీ
తుడుచుకు పోనిది... తెంచుకు పోనిది
ప్రేమకు మాంగల్యం... ప్రేమకు మాంగల్యం  

పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరి పోదు
సరిపోదు.. సరి కాదు  



చరణం 2 :




అనురాగానికర్ధం త్యాగం... అదే అసలైన ప్రేమకు నిర్వచనం
మాటలకే అందనిది... మనసులకే అనుభవమైనదీ
భాష లేనిది...  భావన వున్నది..
జన్మకు సరిపోనిది...  జన్మలకే అంకితమైనదీ
ప్రేమకు మాంగల్యం... ప్రేమకు మాంగల్యం  



పసుపు తాడుకు ముడులు వేసి...  బంధమంటే సరిపోదు
ఏడూ అడుగులు నడిచినంతనే...  భార్య అంటే సరి కాదు..
సరిపోదు.. సరి కాదు 
పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరి పోదు 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1372

No comments:

Post a Comment