Tuesday, January 30, 2018

కలలెందుకు.. కథలెందుకు

చిత్రం :  సూత్రధారులు (1989)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, శైలజ  




పల్లవి :



ఆ...  ఆ...  ఆ...  ఆ
కలలెందుకు.. కథలెందుకు.. తలపెందుకు.. తపమెందుకు
కలలెందుకు.. కథలెందుకు.. తలపెందుకు.. తపమెందుకు


కోర్కెలన్ని కనులముందే కొలువు తీరిన వేళ
కోర్కెలన్ని కనులముందే కొలువు తీరిన వేళ


కలలెందుకు.. కథలెందుకు.. తలపెందుకు.. తపమెందుకు



చరణం 1 :



కొనచూపుల కలికితనం...  విరులవాన కురిసింది
కొనచూపుల కలికితనం...  విరులవాన కురిసింది
కరిగిపోని కాంతివనం...  కోటి చిగురులేసింది


చిరునవ్వుల చల్లదనం...  సిరుల వరము చిలికింది
చిరునవ్వుల చల్లదనం...  సిరుల వరము చిలికింది
చెదిరిపోని చెలిమి ధనం...  తీరని ఋణమయ్యింది


మలిగిపోని మమతలన్ని మదిని వెలిగే వేళ
పోత పోసిన పున్నెమంత పున్నమయ్యే వేళ
ఆ ఆ ఆ ఆ ఆ


కలలెందుకు...  ఆ...  ఆ...  ఆ...  ఆ
కథలెందుకు...  ఆ...  ఆ...  ఆ...  ఆ
తలపెందుకు...  ఆ...  ఆ...  ఆ...  ఆ
తపమెందుకు...  ఆ...  ఆ...  ఆ...  ఆ


   



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1453

No comments:

Post a Comment