Tuesday, January 30, 2018

ఏవేవో చిలిపి తలపులు

చిత్రం :  సుమంగళి (1965)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్, జానకి 




పల్లవి :



ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో..



ఏవేవో వలపు తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో..



చరణం 1 :



కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి
అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది
కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి
అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది

మరపురాని తొలిరేయి మరల రానిది
మరపురాని తొలిరేయి మరల రానిది
మగువ జీవితాన ఇదే మధురమన్నది


ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో....



చరణం 2 :



ఒక్క క్షణం

మ్మ్ మ్మ్ మ్మ్

ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది
కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది
ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది
కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది

కన్నె మనసు ఏవేవో కలలు కన్నది
కన్నె మనసు ఏవేవో కలలు కన్నది
ఆ కలల రూపు ఈ రేయే కాంచమన్నది
మ్మ్ మ్మ్హు..
ఆహా!


ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో... 


చరణం 3 :



తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి
తీసియున్న తలపులను మూయమన్నది
తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి
తీసియున్న తలపులను మూయమన్నది

మనసు తోటి తనువు కూడ నీది కానున్నది
మనసు తోటి తనువు కూడ నీది కానున్నది
మనుగడ ఈ నాటితో మనది కానున్నది 


ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది 

ఏవేవో వలపు తలపులురుకుతున్నవి
అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది
ఏవేవో..







No comments:

Post a Comment