Monday, February 5, 2018

ఊర్వశివో... ఉదయానివో

చిత్రం :  వసంత గీతం (1985) 
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి  

పల్లవి :

ఓ..హో..హో...హో... హో.... ఓ...
ఆ..ఆ...ఆ..హాహాహా..ఆ...ఆ
లలలలాలాలలలలలలలలల
లాలాలాలా.....

ఊర్వశివో... ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో
ఊర్వశివో..ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో
రాగిణివో..రసధ్వనివో... బృందావనికే ఆమనివో
ఊర్వశివో..ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో

చరణం 1 :

ఆలయగంటల లయలో పుట్టిన సంగీతానికి హారతివో
మదనబాణము మదికి ప్రాణమై సాగివచ్చిన ఆరతివో

తూరుపుదిక్కున కుంకుమవీణలు మీటిన సంధ్యాభానుడివో
వెలుగు కావ్యమున బ్రతుకు నాట్యమై పరిమళించిన భరతుడివో
కనులు పండే కలవు నీవై...  కదలిరావే కళవు నీవై
స్వరమూ సుఖము జతగా కలిసే నీ పద సన్నిధిలో

ఊర్వశిలా..ఉదయినిలా ... మువ్వల నవ్వుల మోహినిలా
ఊర్వశిలా..ఉదయినిలా...  మువ్వల నవ్వుల మోహినిలా
కవితలతో నా ఎదలో కదిలిక లూరిన ఊపిరివో
ఊర్వశిలా..ఉదయినిలా...  మువ్వల నవ్వుల మోహినిలా 

చరణం 2 :

నీ పెదవులనే పదములు కోరిన అష్టపదములలో గోపికనో
పదము పాదమై నటన వేదమై నీవు పలికిన గీతికనో..

శిలలధుళిలో శిల్పకాంతలా చిగురువేసిన శైలికవో..
దివికి నేలగా భువికి నింగిలా మేనువిరిచినా మేనకవో... 

జలదరించే జలదనాదం...  కదలిరానా నెమలినేనై
శృతులు జతులు సుధలై పొంగే నీ శుభ వీక్షణలో

ఊర్వశివో..ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో
రాగిణివో..రసధ్వనివో... బృందావనికే ఆమనివో

ఊర్వశిలా..ఉదయినిలా మువ్వల నవ్వుల మోహినిలా
కవితలతో నా ఎదలో కదిలిక లూరిన ఊపిరివో

ఊర్వశివో..ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో

No comments:

Post a Comment