Monday, February 5, 2018

వసంతాలు విరిసే వేళా

చిత్రం :  వసంత గీతం (1985)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి 



పల్లవి :


వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూశాను
వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూశాను
నీ పూజకే పువ్వునై వేచినాను
వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూశాను



చరణం 1 :


దిగంతాల అంచులు దాటి...  స్మరించాను నీవే దిక్కనీ
మరో జన్మ హద్దులు దాటి...  వరించాను నిన్నే ప్రేయసీ
నదినడిగే కడలివలే... పదమడిగే కవితవలే
ఇలా సాగిపోనీ సంగమాలు
ఇదే స్వప్నమో... సత్యమై నిలిచిపోనీ


వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను
నీ పూజకే పువ్వునై వేచినాను..
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను



చరణం 2 :



చైత్రమాస కుసుమాలన్నీ... సుమించేను నీలో ప్రేమగా
శృంగార భావాలెన్నో జ్వలించెను నాలో లీలగా


లత అడిగే తరువు వలే... జత అడిగే తనువు వలే
ఇలా సాగిపోనీ జీవితాలు..
ఇదే కావ్యమై... గానమై మిగిలిపోనీ


వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను
నీ పూజకే పువ్వునై వేచినాను
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1903

No comments:

Post a Comment