Saturday, May 12, 2018

ఈ నేలకు తెలుసు

చిత్రం : పంచాయితి (1977)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :  


ఈ నేలకు తెలుసు... నీటికి తెలుసు
చేలకు తెలుసు... గాలికి తెలుసు.. నా మనసు
నీకు తెలియకుంటే..ఏ..ఏ.. అడిగి తెలుసుకో
నీకు తెలియకుంటే..ఏ..ఏ.. అడిగి తెలుసుకో


తెలిసాక తెలియనట్టే దాచుకో...
తెలిసాక తెలియనట్టే దాచుకో...
నీకు తెలియకుంటే..ఏ..ఏ.. అడిగి తెలుసుకో



చరణం 1 :


ఈ మొగ్గలతో పుట్టాను.. పువ్వులతో పెరిగాను
ముసురుకునే తావిలా గాలితో ఎగిరాను...
ఈ మొగ్గలతో పుట్టాను.. పువ్వులతో పెరిగాను
ముసురుకునే తావిలా గాలితో ఎగిరాను... 


కన్నెమనసు వరిచెల్లో వెన్నునై వెలిశాను
సన్ననీ పంటకాల్వ సంగీతమైనాను
ఈ అన్నిటా ఉన్న నేను అందరికి తెలుసు... 

నా మనసు... నీకు తెలియకుంటే..ఏ..ఏ.. అడిగి తెలుసుకో


చరణం 2 :


కోకిలమ్మనడుగు నా గుండెలోని రాగాన్ని
మల్లెపువ్వునడుగు నా మనసుకున్న తెల్లదనాన్ని
కోకిలమ్మనడుగు నా గుండెలోని రాగాన్ని
మల్లెపువ్వునడుగు నా మనసుకున్న తెల్లదనాన్ని


కోడెదూడనడుగు నా కోరికల వేగాన్ని
ఇన్నీ చెబుతాయి నాలో ఉన్న నిజాన్ని

నీకు తెలియకుంటే..ఏ..ఏ.. అడిగి తెలుసుకో



చరణం 3 :


చేపపిల్లతో ఈది చిట్టి అలలతో ఊగి
నా తల్లి ఈ గంగ నరనరాల పారంగా
చేపపిల్లతో ఈది చిట్టి అలలతో ఊగి
నా తల్లి ఈ గంగ నరనరాల పారంగా
నారోసినదెవ్వరో నాకు తెలియకున్నా
నా జన్మ ఒకరికి నేడు ఇచ్చుకున్నాను
కాదంటే ఇక్కడే కలువనై పుడతాను


ఈ నేలకు తెలుసు... నీటికి తెలుసు
చేలకు తెలుసు... గాలికి తెలుసు..నీ మనసు
నిన్ను తెలుసుకున్నా.. నన్ను కలుపుకున్నా
నిన్ను తెలుసుకున్నా.. నన్ను కలుపుకున్నా


నువ్వున్నా చోటల్లా నేనున్నా
నువ్వున్నా చోటల్లా నేనున్నా
నిన్ను తెలుసుకున్నా.. ఆ.. ఆ.. నన్ను కలుపుకున్నా



No comments:

Post a Comment