Friday, May 11, 2018

నీ కళ్ళకు మనసుంది




చిత్రం : బ్రతుకే ఒక పండుగ (1977)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :  


నీ కళ్ళకు మనసుంది ఆ మనసుకు చూపుంది
అది నా కన్నులతో లోకానంతా చూడక చూస్తుంది
నీ కళ్ళకు మనసుంది ఆ మనసుకు చూపుంది 



చరణం 1 :


ఏమిటది.. పూదోటా
ఇక్కడ పువ్వులు పూచి నవ్వులు రువ్వును ప్రతి పూటా
ఈ ఘుమఘుమలూ...
ఆ పూచిన పువ్వులు వీచే  కమ్మని వాసనలు
ఈ గలగలలు..
ఆ వాసన మోసే గాలులు చేసే సందడులు
ఈ ఝుమఝుమలు...
పూతేనెలు తాగి తుమ్మెద చేసే అల్లరులు


ఇన్ని సొగసుల ఈలోకం ఉన్నది నీకోసం


నా కళ్ళకు జత ఉంది... ఆ జతకొక మనసుంది
ఆ మనసు కళ్ళూ కలిపి నాకూ మనుగడనిచ్చింది
నా కళ్ళకు జత ఉంది... ఆ జతకొక మనసుంది



చరణం 2 :


తొలిరేయి... ఇది తొలిరేయి
మనాసులు తనువులు పెనవేసుకొనే తీయ తీయని రేయి
ఏమీ సిగ్గులు...
నా జీవితానికి మీరిచ్చినవీ నిగ్గులు
ఏమిటీ కన్నీళ్ళు...
నా కన్నుల చీకటి కడిగిన కరుణకు అంజలులు
ఏమీ నవ్వుళు...
మీ పాదపూజకై నేనర్పించే పిచ్చిపువ్వులు


ఇక ప్రతిరేయి తొలిరేయి.. మీరే నాకిక కనుదోయి


నా కళ్ళకు జత ఉంది... ఆ జతకొక మనసుంది
ఆ మనసు కళ్ళూ కలిపి నాకూ మనుగడనిచ్చింది


నీ కళ్ళకు మనసుంది ఆ మనసుకు చూపుంది
అది నా కన్నులతో లోకానంతా చూడక చూస్తుంది
నీ కళ్ళకు మనసుంది ఆ మనసుకు చూపుంది 





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7352

1 comment: