Tuesday, July 10, 2018

నడిరేయి గడిచేనే

చిత్రం : జయసింహ  (1955)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపథ్య గానం : సుశీల 



పల్లవి : 


నడిరేయి గడిచేనే చెలియా...
రాడాయెనే సామి... నా సామి
రాడాయెనే సామి... నేడూ


నడిరేయి గడిచేనే

ఎదురు తెన్నులు చూచి చూచి..ఓ... చెలియా వానికై వేచి వేచి నేడు
నడిరేయి గడిచేనే చెలియా... రాడాయెనే సామి... నేడూ


నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...



చరణం 1 : 



గగనాన నెలరేడు దిగజారిపోయె
సిగలోని విరులన్ని పసివాడిపోయె...
గగనాన నెలరేడు దిగజారిపోయె
సిగలోని విరులన్ని పసివాడిపోయె... 



దిగులాయనే... ఏ..ఏ..ఏ...ఏ..
దిగులాయనే... మది వగలే మిగులాయే...
మగరాయడే వాడ మనలేనో నేడూ...


నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...



చరణం 2 :


గడిపా పడిగాపు పడియుండలేనే
ఘడియొక్క యుగమూగా గడుపగా లేనే
గడిపా పడిగాపు పడియుండలేనే
ఘడియొక్క యుగమూగా గడుపగా లేనే



ఎడబాటుతో.. ఓ..ఓ..ఓ..
ఎడబాటుతో... గమరిస రిసనిసదప గమరిగమ
ఎడబాటుతో.... సా..నీ..దా..సానీ సనిదపమ... నిదప నిదపమగ
మపమగమగమ పదప మపమస
దనిద పద పద నినిసని పపదమప


ఎడబాటుతో ఈ సడిలేని రేయి
కడలేని కన్నీరై నిలువాగలేనే 



నడిరేయి గడిచేనే చెలియా... రాడాయెనే సామి... నేడూ

నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18509

No comments:

Post a Comment