Saturday, August 11, 2018

పబ్లిక్‌ రా

చిత్రం : నేరం నాది కాదు ఆకలిది (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు




పల్లవి : 



హేయ్‌ పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా
పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  


అహ అసలూ తెలుసు...  అరె నకిల్లీ తెలుసు
అసలూ తెలుసు నకిల్లీ తెలుసు... అందరి గోత్రం తెలుసూ     


పబ్లిక్‌ రా... పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా  



చరణం 1 :


మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుంది
మచ్చిక చేస్తే గంగిగోవులా పాలందిస్తుంది
ఇది రెచ్చిపోతే కోడెతాచులా ప్రాణం తీస్తుంది


నమ్మితె జే కొడుతుంది...  నచ్చితె జో కొడుతుంది
జే కొడుతుంది జో కొడుతుంది... మనసు విరిగితే మసిచేస్తుంది    

   

పబ్లిక్‌ రా... హహహా
పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా 



చరణం 2 :



కబుర్లు చెప్పీ కడుపులు నింపే కాలంపోయిందీ
కబుర్లు చెప్పీ కడుపులు నింపే కాలంపోయిందీ
సందేశాలూ దిగుమతి చేసే సమయం దాటిందీ

అరె మాటలకన్నా  చేతలు మిన్న 

మాటలకన్న చేతులు మిన్న... కాదంటే మీ బ్రతుకులు సున్న  


పబ్లిక్‌ రా... హహహా
పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన పబ్లిక్‌ రా 





చరణం 3 :


అహ దాచుకోండిరా పెట్టెల నిండా వెండీ బంగారం
దాచుకోండిరా పెట్టెల నిండా వెండీ బంగారం
కాచేస్తారా తిండిగింజలను ఎక్కడిదీ న్యాయం
మా ఆకలిముందు...  మా అలజడి ముందు
ఆకలి ముందు అలజడి ముందు... దోపిడి దొరల ఆటల బందు        



పబ్లిక్‌ రా... పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా
అహ అసలూ తెలుసు...  అరె నకిలి తెలుసు
అసలూ తెలుసు నకిలి తెలుసు... అందరి గోత్రం తెలుసూ   
పబ్లిక్‌ రా... పబ్లిక్‌ రా... ఇది అన్ని తెలిసిన..పబ్లిక్‌ రా 






No comments:

Post a Comment