Sunday, August 12, 2018

నా కన్నులు నీకో కథ చెప్పాలి

చిత్రం : నిండు సంసారం (1968)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల 

పల్లవి : 

నా కన్నులు నీకో కథ చెప్పాలి... కన్ను తెరు... కన్ను తెరు
నా కన్నెవలపులో అమృతముంది... చవి చూడూ... చవి చూడూ 

నా మనసుకు వేరే పనులున్నాయి... నన్ను విడు... నన్ను విడు
ప్రేమించేందుకు తీరిక లేదు... చెయ్యి  విడు... చెయ్యి  విడు 

చరణం 1 :

ఆశలు నాలో రేపేవు... అనురాగం నీలో దాచేవు
ఆశలు నాలో రేపేవు... అనురాగం నీలో దాచేవు
ఇప్పుడు ఎంతగ కాదన్నా... తప్పించుకొని పోలేవు

నాకెన్నో బాధ్యతలున్నాయి... నామదిలో సంకెళ్ళున్నాయి
నాకెన్నో బాధ్యతలున్నాయి... నామదిలో సంకెళ్ళున్నాయి
నాతో నీకు ఉండదు హాయి... ఆశ వదులుకో అమ్మాయి... ఆశ వదులుకో అమ్మాయి

నా మనసుకు వేరే పనులున్నాయి... నన్ను విడు... నన్ను విడు
నా కన్నెవలపులో అమృతముంది... చవి చూడూ... చవి చూడూ  

చరణం 2 :

మనిషంటే మనసుండాలి... మనసుంటే అది ఇవ్వాలి
మనిషంటే మనసుండాలి... మనసుంటే అది ఇవ్వాలి
ఇచ్చిన మనసు.. నచ్చిన వయసు... ముచ్చట తీరా నవ్వాలి

నాలోనూ ఉన్నది మనసు... ఆ సంగతి నీకూ తెలుసు
నాలోనూ ఉన్నది మనసు... ఆ సంగతి నీకూ తెలుసు
చేయకు చెలిమిని అలుసు... ఇపుడే వేయకు వలపుల గొలుసు... వేయకు వలపుల గొలుసు 

నా మనసుకు వేరే పనులున్నాయి... నన్ను విడు... నన్ను విడు
నా కన్నులు నీకో కథ చెప్పాలి... కన్ను తెరు... కన్ను తెరు

నన్ను విడు... నన్ను విడు... హోయ్... కన్ను తెరు... కన్ను తెరు
హోయ్... నన్ను విడు... నన్ను విడు... కన్ను తెరు... కన్ను తెరు 

No comments:

Post a Comment