Monday, August 20, 2018

ఓ వన్నెకాడా

చిత్రం : పాండవ వనవాసం (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపథ్య గానం : జానకి 


పల్లవి :

ఆ...అ...ఆ..ఆ... ఆ..ఆ...అ...ఆ..ఆ... ఆ..


ఓ వన్నెకాడా...  ఓ వన్నెకాడా
నిన్ను చూచి నా మేను పులకించెరా
ఓ వీరా నన్నేలి కులికించరా


ఓ వన్నెకాడా నిన్ను చూచి నా మేను పులకించెరా
ఓ వీరా నన్నేలి కులికించరా



చరణం 1 :




మరులు పెంచే మంచిగంధం...  మల్లెపూపానుపు వేచేనోయి
మరులు పెంచే మంచిగంధం...  మల్లెపూపానుపు వేచేనోయి
నీ దయకోరి నిలిచేనోయి


ఓ వన్నెకాడా...  నిన్ను చూచి నా మేను పులకించెరా
ఓ వీరా నన్నేలి కులికించరా




చరణం 2 :



ఉరుకుల పరుగుల దొర... మగసిరి కిది తగదురా
ఉరుకుల పరుగుల దొర...  నీ మగసిరి కిది తగదురా
ఆ ఆ ఆ ఆ... ఉరుకుల పరుగుల దొర


చూడరా ఇటు చూడరా...  సరి ఈడుజోడు వన్నెలాడినేరా
చూడరా ఇటు చూడరా...  సరి ఈడుజోడు వన్నెలాడినేరా
వలపు గొలిపే బింకాల కలల కలిపే పొంకాల... వదలిపోబోకురా

ఉరుకుల పరుగుల దొర నీమగసిరి కిది తగదురా
ఆ ఆ ఆ ఆ ఉరుకుల పరుగుల దొర



చరణం 3 :


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తాళలేరా మదనా... మదనా మదనా మదనా...
నే తాళలేరా మదనా... మదనా మదనా మదనా...
నే తాళలేరా మదనా




విరుల శరాల వేగితి చాలా...  విరహమోర్వజాలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విరుల శరాల వేగితి చాలా... విరహమోర్వజాలా
ఇలలో లేని అమరసుఖాల తేలజేతు వేగ ఎదనుగతియగ
తాళలేరా మదనా


తాళలేరా మదనా ... మదనా మదనా మదనా...  నే తాళలేరా...
నే తాళ... నే తాళ... ఇక తాళలేరా మదనా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=82

No comments:

Post a Comment