Thursday, August 30, 2018

కళ్ళు తెరచి కనరా

చిత్రం : రాజు-పేద (1954)
సంగీతం :  ఎస్.రాజేశ్వరరావు
గీతరచయిత :  కొసరాజు
నేపథ్య గానం :  జిక్కి 

పల్లవి :  

కళ్ళు తెరచి కనరా... సత్యం ఒళ్ళు మరచి వినరా
సర్వం నీకె బోధ పడురా... 

కళ్ళు తెరచి కనరా... సత్యం ఒళ్ళు మరచి వినరా
సర్వం నీకె బోధ పడురా... 

మేడల మిద్దెల మెలిగే వారిలో... పూరి గుడిసెలో తిరిగే వారిలో
రక్తమాంసములు ఒకటే గదరా....
రక్తమాంసములు ఒకటే గదరా... హెచ్చుతగ్గులూ హుళక్కి గదరా

కళ్ళు తెరచి కనరా... సత్యం ఒళ్ళు మరచి వినరా
సర్వం నీకె బోధ పడురా... 

చరణం 1 :

పరమాన్నం తిని మురిసేవారికి... పట్టె మంచముల పండేవారికి
అంబలి త్రాగీ ఆనందించే...
అంబలి త్రాగీ ఆనందించే... పేదలకున్న హాయిలేదురా

కళ్ళు తెరచి కనరా... సత్యం ఒళ్ళు మరచి వినరా
సర్వం నీకె బోధ పడురా... 

చరణం 2 :

పదవులకోసం జుట్లు ముడేసీ... ప్రజలనెత్తిపై చేతులు పెట్టి
కన్నూమిన్నూ కానని వారికి...
కన్నూమిన్నూ కానని వారికి... ఎన్నటికైనా ఓటమి తప్పదు

కళ్ళు తెరచి కనరా... సత్యం ఒళ్ళు మరచి వినరా
సర్వం నీకె బోధ పడురా... 

చరణం 3 :

కాల చక్రము మారిందంటే... కధ అడ్డంగా తిరిగిందంటే
రాజే పేదై బాధలు పడును...
రాజే పేదై బాధలు పడును... పేదే రాజై సుఖము జెందునూ

కళ్ళు తెరచి కనరా... సత్యం ఒళ్ళు మరచి వినరా
సర్వం నీకె బోధ పడురా... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=31

No comments:

Post a Comment