Monday, September 3, 2018
ఆకాశమేలే అందాల రాజే
చిత్రం : రక్తసంబంధం (1962)
ఆకాశమేలే..ఏ..ఏ..ఏ...
నన్నే చూసి నవ్వులు దాచీ... కన్నులు కలిపాడే
నా రాజు తానే నను చూడగానే... లోలో మురిసితినే... హోయ్
ఆ కళ్ళలోని అందాలు సోకి.. లోకం మరచితినే... హోయ్..
దొరలా మెలగి తరుణి హృదయం దోచిన మొనగాడే... హోయ్
ముంగిట నిలచిన మోహన రూపుని ముందుకు పోవేమే...
అహహా.. ఓహోహో..
నా వన్నెకాణి నయనాలలోనే భావం తెలిసినదే... హోయ్
నాగొంతులోనే ఏనాడు లేని రాగం విరిసినదే... హోయ్
కలగా కదలే కమ్మని తలపే నిజమై నిలచినదే... హోయ్
ముంగిట నిలచిన మోహన రూపుని ముందుకు పోవేమే...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment