Sunday, December 16, 2018

ముద్దుల మా బాబు

చిత్రం : జీవన జ్యోతి (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల 


పల్లవి : 


ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...
సద్దు చేశారంటె వులికులికి పడతాడు..  


నా పాపకు నే పాడే లాలిపాట... ఈ లోకాలకన్నిటికి జోలపాట... జుజుజుజుజు..జుజుజుజుజు.. జుజుజుజుజు..జుజుజుజుజు.. 



చరణం 1 :



ఎదురుగా ఉన్నాను నేను... ఇంకెవరినో కాదూ మీ అమ్మను
ఎదురుగా ఉన్నాను నేను... ఇంకెవరినో కాదూ మీ అమ్మను


నువ్వు రోజుకొక్క ఏడూ పెరగాలని....
నీ ముద్దూ మురిపాలు చూడాలని...
కలవరించిపోయే నీ తల్లిని నేనూ...
కలవరించిపోయే నీ తల్లిని నేనూ...
ఆ కలలలోనే బ్రతుకుతున్న తల్లిని నేనూ.. పిచ్చితల్లిని నేనూ



జుజుజుజుజు..జుజుజుజుజు.. జుజుజుజుజు..జుజుజుజుజు.. 




చరణం 2 :



ఏ వేళ ఈ తనువు రాలిపోవునో... ఏ గాలికి ఈ దీపం ఆరిపోవునో...
ఏ వేళ ఈ తనువు రాలిపోవునో... ఏ గాలికి ఈ దీపం ఆరిపోవునో...


ఈ తనువులో కొన ఊపిరి ఉన్నప్పుడే...
నువు తనివి తీర 'అమ్మా...అమ్మా  ' అని అన్నప్పుడే


ఇన్నాళ్ళ ఆశలన్నీ పండేనులే...
ఇన్నాళ్ళ ఆశలన్నీ పండేనులే...
ఈ జన్మకు నూరేళ్ళు నిండేనులే...


జుజుజుజుజు..జుజుజుజుజు.. జుజుజుజుజు..జుజుజుజుజు.. 





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6657

2 comments:

  1. కొన్నిఏళ్ళుగా బొమ్మని తన బిడ్డగా భావించి తిరుగుతున్న పిచ్చితల్లి, తన బిడ్డ (బొమ్మ) ఇన్నేళ్ళైనా ఎదగక పోవడం, తన ప్రేమకు స్పందించక పోవడం ఆ తల్లిని ఎంతగా కలచి వేశాయో. పైగా వయసు మీద పడి, వార్ధక్యం వచ్చి, ఇంక ఎంతో సమయం లేదని గ్రహించిన ఆ తల్లి, తన బిడ్డ (బొమ్మ) తొందరగా ఎదగాలని, తను రాలిపోయేలోపు, ఒక్కసారి తనను అమ్మా అని పిలిస్తే చాలు విని తరించాలన్న ఆ తల్లి వేదనను, కాదు కాదు క్షోభను - కవి తన పదాలతో (ఆ క్షోభను) మనల్ని అనుభవించేలా ఎలా రచించారో కదూ!

    నిజమే, ఈ సృష్టిలో తన బిడ్డల కోసం ఆరాటపడే ప్రతి తల్లీ ఒక పిచ్చిదే.

    ఈ పాటను ఎప్పుడు విన్నా, చదివినా, పాడుకున్నా నాకు కన్నీటిపర్యమే.

    మీ యత్నప్రయాసలకు చాలా కృతజ్ఞతలు అండీ. నిజంగా మీరు ఈ పాటలన్నిటిని బ్లాగీకరించి సమాజానికి చాలా సేవ చేస్తున్నారు.

    ReplyDelete